Advertisement

గేమ్ ఛేంజర్ షూటింగ్ పై షాకింగ్ న్యూస్


రామ్ చరణ్-కోలీవుడ్ టాప్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా మూవీ గేమ్ ఛేంజర్  షూటింగ్ 80 శాతం పూర్తయ్యింది.. మిగతా 20 శాతం త్వరలోనే పూర్తి చేసి సినిమా రిలీజ్ డేట్ ప్రకటిస్తామని నిర్మాత దిల్ రాజు రీసెంట్ గానే సెలవిచ్చారు. అయితే ఆ 20 శాతం కోసం ఇంకా 70 రోజుల షూటింగ్ బ్యాలన్స్ ఉందట. అంటే దాదాపుగా రెండు నెలలపాటు ఏకధాటిగా షూటింగ్ చేస్తేనే గేమ్ ఛేంజర్ షూటింగ్ ఓ కొలిక్కి వస్తుంది. మరి ఈ మధ్యలో ఇండియన్ 2 షూటింగ్ జరగాలి.. ఈ లెక్కన గేమ్ ఛేంజర్ సినిమా వచ్చే ఏడాది సమ్మర్ లో కూడా విడుదలయ్యే ఛాన్స్  కనిపించడంలేదు

Advertisement

అందుకే మేకర్స్ ఏమి మాట్లాడకుండా కామయ్యారు అంటున్నారు. వచ్చే ఏడాది ఏ దసరాకో.. లేదంటే 2025 సంక్రాంతికి కానీ గేమ్ ఛేంజర్ విడుదల చేస్తారు. కాబట్టే గేమ్ ఛేంజర్ అప్ డేట్స్ విషయంలో మేకర్స్ కూడా సైలెన్స్ ని మైంటైన్ చేస్తున్నారనే టాక్ మొదలయ్యింది. రామ్ చరణ్ రీసెంట్ గానే మైసూర్ లో గేమ్ ఛేంజర్ షూటింగ్ షెడ్యూల్ పూర్తి చేసుకుని వచ్చారు. నిన్న బుధవారం డిసెంబర్ 20కి తన కుమర్తె క్లింకార జన్మించి 6 నెలలు పూర్తవడంతో మహాలక్ష్మి అమ్మవారి దర్శనానికి భార్య ఉపాసన, కుమార్తెతో సహా వెళ్లారు.

Shocking news on the Game Changer shooting:

Game Changer shooting update 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement