Advertisement
Google Ads BL

మెగా కోడలు ఇంటి పేరు మార్చేసింది


నాకు త్వరగా పెళ్లి చేసేయండి నాన్న.. అంటూ క్యూట్ ఫేస్ పెట్టి.. తొలి సినిమాతోనే ప్రేక్షకులను ఆకర్షించిన హీరోయిన్ లావణ్య త్రిపాఠి. ఆ తర్వాత ఆమె సినిమా లైఫ్ ఏ విధంగా పయనించిందో అందరికీ తెలిసిందే. మరి ఎప్పుడు పడేసిందో తెలియదు కానీ.. మెగా ప్రిన్స్ వరుణ్ బాబుని లైన్‌లో పెట్టేసింది.. లగ్గం కూడా కానిచ్చేసింది. రీసెంట్‌గా లావణ్య, వరుణ్‌ల పెళ్లి ఇటలీలో ఇరు కుటుంబాల సభ్యులు, దగ్గర బంధువుల సమక్షంలో గ్రాండ్‌గా జరిగింది. పెళ్లి తర్వాత హైదరాబాద్‌లో గ్రాండ్ రిసెప్షన్‌‌ని అందరి సమక్షంలో జరుపుకుందీ జంట. 

Advertisement
CJ Advs

పెళ్లి అనంతరం హనీమూన్ వెళ్లినట్లుగా.. కొన్ని పిక్స్‌ వైరల్ అయ్యాయి. హనీమూన్ ముగించుకుని ఇండియాకు వచ్చేసిన ఈ నూతన జంట.. మళ్లీ ఎవరి పనుల్లో వారు బిజీ అయిపోయారు. ముఖ్యంగా వరుణ్ తేజ్ ఆపరేషన్ వాలెంటైన్ ప్రమోషన్స్ ఒక వైపు, మరోవైపు మట్కా షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. లావణ్య త్రిపాఠి విషయానికి వస్తే.. పెళ్లికి ముందు తను ఓకే చేసిన ప్రాజెక్ట్స్‌ని కంప్లీట్ చేసే పనిలో ఉంది. అయితే మెగా కోడలిగా ప్రమోషన్ పొందిన లావణ్య.. సోషల్ మీడియాలోనూ తన పేరును మార్చేసింది. 

సోషల్ మీడియా ఇన్‌స్టాలో ఇప్పటి వరకు లావణ్య త్రిపాఠి అని మాత్రమే ఆమె పేరు ఉండేది. ఇప్పుడా పేరుకు ముందు కొణిదెల అనే ట్యాగ్‌ని యాడ్ చేసింది లావణ్య. అంతే, ఆమె అలా మార్చిందో లేదో.. ఆ పేరును స్క్రీన్ షాట్ తీసి సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తూ.. మెగా ఫ్యాన్స్ తమ ఆనందాన్ని తెలియజేస్తున్నారు. మెగా చిన్న కోడలు, లావణ్య వదిన అంటూ ఆమెకు వెల్‌కమ్ చెబుతున్నారు. అయితే ఇన్‌స్టాలో మాత్రమే ఆమె కొణిదెల ట్యాగ్‌ని యాడ్ చేసింది. ట్విట్టర్ అకౌంట్‌లో మాత్రం ఆమె పేరులో ఎటువంటి మార్పు చేయలేదు. ఇక ఎప్పుడైతే ఇన్‌స్టాలో కొణిదెల ట్యాగ్ యాడ్ చేసిందో.. ఆమె ఫాలోయింగ్, ఫాలోయర్స్ కూడా అమాంతం పెరుగుతుండటం విశేషం.

Lavanya Tripathi Changed Her Name in Insta:

Lavanya Tripathi Added Konidela Tag in Her Name
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs