Advertisement
Google Ads BL

పోటాపోటీగా తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై వివరాలు


తెలంగాణ శాసన సభ సమావేశాల్లో నేడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై స్వల్పకాలిక చర్చ జరిగింది. దీనిలో భాగంగా అధికార పార్టీ కాంగ్రెస్, విపక్ష పార్టీ బీఆర్ఎస్‌లు పోటాపోటీగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై డాక్యుమెంట్స్‌ను విడుదల చేశారుజ  డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క 42 పేజీల శ్వేత పత్రాన్ని విడుదల చేయగా.. ఆ వెంటనే బీఆర్ఎస్ కేసీఆర్ తొమ్మిదిన్నరేళ్ల పాలనలో సంపాదించి పెట్టిన ఆస్తుల డాక్యుమెంట్‌ను విడుదల చేసింది.  అసెంబ్లీకి ముందే 51 స్లైడ్స్‌తో బీఆర్‌ఎస్ రిపోర్టును విడుదల చేసింది. పదేళ్లలో సృష్టించిన ఆస్తులు, అభివృద్ధిపై నివేదిక సిద్ధం చేసింది.అయితే శ్వేతపత్రం విడుదల సందర్భంగా భట్టి మాట్లాడుతూ..  ప్రజలంతా అభివృద్ధి చెందాలని తెలంగాణ సాధించుకున్నామని.. కానీ గత ప్రభుత్వం వనరులను సక్రమంగా ఉపయోగించలేదన్నారు. రోజూవారీ ఖర్చులకూ అప్పు చేయాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. పదేళ్లలో రాష్ట్రం దివాలా తీసిందని.. ఆర్థిక అరాచకత్వాన్ని ప్రజలకు చెప్పాల్సిన భాధ్యత తమపై ఉందని పేర్కొంటూ భట్టి శ్వేతపత్రం విడుదల చేశారు.

Advertisement
CJ Advs

ఒక్క రూపాయి అప్పు చేస్తే వెయ్యి రూపాయల అస్తులు సృష్టించాం..

పదేళ్లలో సృష్టించిన ఆస్తులు, అభివృద్ధిపై నివేదిక సిద్ధం చేసి.. దానిని డిపార్ట్మెంట్‌ల వారీగా రిపోర్ట్‌ను విడుదల చేసింది. దీనిలో భాగంగా తెలంగాణ అప్పుల ఊబిలో కూరుకుపోయిందని బీఆర్ఎస్ చెబితే.. తెలంగాణ వచ్చిన తర్వాత 159 శాతం తెలంగాణ ఆస్తులు పెరిగాయని బీఆర్ఎస్ వెల్లడించింది. తెలంగాణ సాధించిన తర్వాత ఒక్క రూపాయి అప్పు చేస్తే వెయ్యి రూపాయల అస్తులు సృష్టించామని బీఆర్ఎస్ తన నివేదికలో పేర్కొంది. తలసరి ఆదాయం 151 శాతం పెరిగిందని.. టాక్స్ వసూళ్లు 161 శాతం.. రిజిస్ట్రేషన్‌ల ఆదాయం 406 శాతం పెరిగిందని వెల్లడించింది. పంటల ఉత్పత్తి పరంగా చూస్తే.. వరి 150 శాతం, పత్తి 50 శాతం పెరిగిందని తెలిపింది. అయితే కాంగ్రెస్ పార్టీ వచ్చేసి బడ్జెటేతర రుణాలు పేరుకుపోయి అప్పుల ఊబిలో తెలంగాణ కూరుకుపోయిందని వెల్లడించింది. 2014లో మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణ.. 2023లో అప్పుల్లో కూరుకుపోయిందని కాంగ్రెస్ తెలిపింది.

కాంగ్రెస్ విడుదల చేసిన శ్వేతపత్రంలోని ప్రధానాంశాలు..

రాష్ట్ర మొత్తం అప్పులు రూ.6,71,757 కోట్లు.

2014-15 నాటికి రాష్ట్ర రుణం రూ.72,658 కోట్లు.

2014-15 నుంచి 2022-23 మధ్య కాలంలో సగటున 24.5 శాతం పెరిగిన అప్పు.

2023-24 అంచనాల ప్రకారం రాష్ట్ర రుణం రూ.3,89,673 కోట్లు.

2015-16లో రుణ, జీఎస్డీపీ 15.7 శాతంతో దేశంలోనే అత్యల్పం.

2023- 24 నాటికి 27.8 శాతానికి పెరిగిన రుణ, జీఎస్డీపీ శాతం.

బడ్జెట్‌కు, వాస్తవ వ్యయానికి మధ్య 20శాతం అంతరం

రెవెన్యూ రాబడిలో ఉద్యోగుల జీతాలకు 35 శాతం వ్యయం

రెవెన్యూ రాబడిలో 34 శాతానికి పెరిగిన రుణ చెల్లింపుల భారం

57 ఏళ్లలో తెలంగాణ అభివృద్ధికి రూ.4.98 లక్షల కోట్ల వ్యయం.

రాష్ట్రం ఏర్పడిన తర్వాత 10 రెట్లు పెరిగిన రుణభారం.

అప్పులు కాదు ఆస్తులు పెంచాం... వివరాలివే...

33 జిల్లాలకు 1649.62 కోట్ల కలెక్టరేట్ల భవనాల నిర్మాణాలు.

ఇప్పటికే 25 కలక్టర్ భవనాలు ప్రారంభం

2014 తర్వత 128 మున్సిపాలిటీలు, 13 కార్పొరేషన్ ల ఏర్పాటు

రాష్ట్రంలో ప్రస్తుతం 32 వేల 717 కిలోమీటర్ల రోడ్లు

8578 కిలో మీటర్ల మేర కొత్త రోడ్లు నిర్మాణం

కొత్తగా 4713 చెత్త తరలించే వాహనాలు

1022 కొత్త గురుకులాలు, 849 ఇంటర్ గురుకులాలు, 85 డిగ్రీ గురుకులాలు

7289.54 కోట్లతో మన ఊరు బడి తో 1240 బడుల నిర్మాణం, 1521 స్కూళ్ళలో సౌర విద్యుత్,

23,37 654 మంది విద్యార్థులకు లబ్ధి

 

కేజి టూ పీజీ గంబిరావు పేటలో తొలి క్యాంపస్

 

70 గదుల నిర్మాణం

250 మందికి సరిపడేలా అంగన్వాడీ కేంద్రం

1000 మంది కూర్చునేల డైనింగ్ హాల్

22.5లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు

334 చిన్న పరిశ్రమల పురుద్దరణ

10,40పీ ఎకరాల్లో అతిపెద్ద పార్మ క్లస్టర్

81.81 చ.కి.మి పెరిగిన పచ్చదనం, హరిత హరం

హెచ్‌ఎమ్‌డీఏ పరిధిలో 129 ప్రదేశాల్లో 188 ఫారెస్ట్ బ్లాకులు

19472 పల్లె ప్రకృతి వనాలు, 13657ఎకరాల విస్తీర్ణం

109 అర్బన్ ఫారెస్ట్ 75740 ఎకరాల విస్తీర్ణం

1,00,691 కిమీ రహదారి వనాలు

10,886 కిమీ కందకల తవ్వకం

19వేళ పల్లెల్లో పార్కులు

2700 ట్రీ పార్కులు

రూ.1200 కోట్లతో యాదాద్రి పునర్నిర్మాణం

రూ.2800 కోట్ల ఆలయాల అభివృద్ధి

రూ.100 కోట్లతో దేవాదాయ శాఖ కు నిధులు

రూ.75 కోట్లు దూప దీప నైవేద్యం కింద అర్చకుల వేతనం

రూ.212 కోట్లతో బ్రహ్మణ సంక్షేమం కోసం

ఆరోగ్య శాఖలో....

34000 హాస్పిటల్ బెడ్స్

34000 ఆక్సిజన్ బెడ్స్,

80 ఐ సీ యు కేంద్రాలు

56బ్లడ్ బ్యాంక్‌లు

82 డయాలసిస్ కేంద్రాలు

500 బస్తీ దవాఖానాలు

1000 పడకల అల్వాల్ టీమ్స్, ఎరగడ్డ టీమ్స్, గడ్డి అన్నారం టీమ్స్, 1261 బెడ్ల తో గచ్చి బౌలి టీమ్స్

రూ.1571 కోట్లతో నిమ్స్ 2000 పడకల ఆసుపత్రి విస్తరణ

రూ.3779 కోట్లతో వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్

33 మెడికల్ కాలేజీలు నిర్మాణం, 8515 మంది ఎంబీబీఎస్ సీట్లు

585 కోట్ల తో పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్

137 పోలీసు భవనాల నిర్మాణం, 654.50 కోట్లతో జిల్లా ఎస్పీ కార్యాలయాలు

10.13 లక్షల సీసీ కెమెరాలు

20,115 పోలీసు వాహనాలు

9 కమీషనరేట్ల ఏర్పాటు, 719 సర్కిల్స్, 164 పోలీస్ సబ్ డివిజన్ లు, 815 పోలీస్ స్టేషన్ పెంపు

కాళేశ్వరం ప్రోజెక్ట్ నిర్మాణం, పాలమూరు రంగారెడ్డి ఎత్తి పోతల పథకం (35 వేల కోట్లు) ప్రారంభం

విద్యుత్ రంగం

2014లో 7748 మెగావాట్ల నుంచి2023 లో 19, 464 మెగావాట్లకు పెంపు

15497 మెగావాట్ల గరిష్ట విద్యుత్ డిమాండ్ ప్రస్తుతం

వ్యవసాయానికి, గృహ వినియోగానికి 24 గంటల కరెంట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం

57.82 శాతం తలసరి విద్యుత్ వినియోగంలో వృద్ధి

లోడ్ మెయింటేన్స్‌లో ట్రాన్స్ ఫార్మర్స్ బిగింపు

2014 లో విద్యుత్ సంస్థల అప్పు 22,423 కోట్లు, 2023లో 81 వేల కోట్లు

2014 లో 44,431 కోట్ల విద్యుత్ ఆస్తులు

2023 లో 1,37, 571 కోట్లు పెరిగిన విద్యుత్ ఆస్తులు

59 వేల కోట్ల అప్పులు, 93 వేల కోట్ల ఆస్తుల పెరుగుదల

ఎస్సీ ఎస్టీల సంక్షేమం కోసం ఈ 10 ఏళ్లలో 70, 965.75 కోట్ల తో నిధులు ఖర్చు

దళిత బంధు పథకం అమలు

రూ.5000 కోట్లతో గొర్రెల పంపిణీ

72,817 కోట్ల రైతు బంధు నిధుల విడుదల

రూ.5402 కోట్ల రైతు బీమా

రూ.572 కోట్ల తో రైతు వేదికల ఏర్పాటు

1,98, 37 వేల ఎకరాల మేర పెరిగిన పంట విస్తీర్ణం

గ్రామాల్లో 100 శాతం మంచి నీటి సౌకర్యం, స్కూళ్ళు, అంగన్వాడీ లు, ప్రభుత్వ సంస్థల్లో నీటి సౌకర్యం

రూ.8735.32 కోట్లతో మిషన్ కాకతీయ, 21, 633 చెరువుల పునరుద్దరణ

రూ.617 కోట్ల తో కొత్త సచివాలయం నిర్మాణం

రూ.146.50 కోట్లతో 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహం నిర్మాణం

రూ.178 కోట్లతో 3ఎకరాల్లో అమరవీరుల స్మారక జ్యోతి

2014లో రూ.27,200 కోట్ల సేల్స్ టాక్స్, 2023లో రూ.72564 కోట్ల వసూళ్లు

2014లో రూ.2832 కోట్ల రిజిస్ట్రేషన్ ఆదాయం ప్రస్తుతం రూ.14,291 కోట్లు వసూలు

2014లో రూ.1,24,104 కోట్లు ఉన్న తలసరి ఆదాయం 2023లో రూ.3.12,398 కోట్ల పెరిగిన తలసరి ఆదాయం

159.6 పెరిగిన తలసరి ఆదాయం

ఇరువురి లెక్కలు ముందు పెట్టేశారు. ఇక ఇప్పుడు ఎవరి మాటల్లో నిజముందో.. ఎవరి మాటలు అభూత కల్పనలో ప్రజలే తేల్చుకోవాలి. 

Details of Telangana competitive economic situation:

Congress to Release White Paper on BRS Misuse of Funds
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs