జబర్దస్త్‌ను వదిలేసిన తర్వాత మంత్రి రోజా బయట కామెడీ చేయడం మొదలు పెట్టారు. పర్యాటక శాఖ మంత్రిగా ఆ శాఖకు ఈమె చేసినంత అన్యాయం మరెవరూ చేయలేదనే చెప్పాలి. తను జనం డబ్బుతో పర్యటనలు చేయడం తప్ప రోజా తన శాఖకు చేసిందేమీ లేదనేది అక్షర సత్యం. ఇక తన శాఖకు న్యాయం చేయడంలో భాగంగా రెండు సార్లు తిరుమలశ్రీవారి దగ్గరకు .. రెండు సార్లు తాడేపల్లి జగన్నను దగ్గరకు వెళ్లడం మాత్రం ఆనవాయితీగా పెట్టుకున్నారు. మరో పని కూడా ఆమె క్రమంగా తప్పక చేస్తుంటారు. అధిష్టానం నుంచి సిగ్నల్ వస్తే చాలు.. టీడీపీ అధినేత చంద్రబాబు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌లపై దారుణాతి దారుణంగా మాటల దాడి చేస్తుంటారు.
దుష్ప్రచారాలంటూ కొట్టివేయడాలెందుకో...
ఇక తన అలవాటులో భాగంగా రోజా నేడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఇక్కడే జబర్దస్త్‌లో చేయాల్సిన కామెడీని చేశారు. తనకు ఈసారి టికెట్ రాదని.. తనను జగనన్న పక్కన పెట్టేస్తారంటూ టీడీపీ దాని అనుకూల మీడియా ప్రచారం చేస్తూ శునకానందం పొందుతున్నాయన్నారు. తనకు టికెట్ ఇవ్వకున్నా కూడా కడవరకూ జగనన్న వెంటే ఉంటానని చెప్పి.. ఆ వెంటనే తనకు టికెట్ ఇవ్వరనేది దుష్ప్రచారం మాత్రమేనని తేల్చి చెప్పారు. టికెట్ ఇవ్వకున్నా జగనన్న వెంటే ఉంటానని చెప్పినప్పుడు ఇక దుష్ప్రచారాలంటూ కొట్టివేయడాలెందుకో. అయినా ఒకప్పుడు మంత్రి పదవి దక్కలేదనే మొహం చాటేసిన రోజా ఇప్పుడు టికెట్ ఇవ్వకున్నా జగనన్న వెంటే ఉంటుందట. ఈవిడ నగరి ఎమ్మెల్యేగా ఎన్నికైన నాటి నుంచి ప్రజా సమస్యలన్నింటినీ పరిష్కరిస్తోందట.
నగరి ఇన్‌చార్జిగా వేరొకరిని నియమిస్తే రోజా పరిస్థితేంటి?
ఈ విషయం నగరి ప్రజలను అడిగితే చెబుతారు. తప్పక తనకే నగరి టికెట్ ఇస్తారని భావిస్తున్నానంటూ రోజా ముక్తాయింపు. పైకి ఏదో డాంబికాలు పోతున్నా కూడా లోలోపల మాత్రం ఎక్కడ టికెట్ ఇవ్వరోననే భయం రోజాలో ఉందని స్పష్టమవుతోంది. రోజాను పక్కనబెడుతున్న విషయాన్ని మంత్రి పెద్దిరెడ్డి అనుచరులు చెబుతున్నారు. కనీసం పార్టీ కేడర్‌ను పట్టించుకోరని సొంత పార్టీ నేతలే విమర్శిస్తున్నారు. అలాంటి వ్యక్తికి టికెట్ ఎందుకివ్వాలని ప్రశ్నిస్తున్నారు. అసలు రోజా టీడీపీని అనే నెపంతో సొంత పార్టీ నేతలకే కౌంటర్ ఇస్తున్నారా? అనేది కూడా సందేహంగా మారింది. ఒకవేళ నగరి ఇన్‌చార్జిగా వేరొకరిని నియమిస్తే రోజా పరిస్థితేంటి? అప్పుడు కూడా జగన్న వెంటే నడుస్తానంటూ డైలాగ్స్ వదులుతుందా? లేదంటే కన్నీళ్లు పెట్టుకుని శాపనార్థాలు పెడుతుందా? అనేది చూడాలి. రెండోదే ఖాయమని తెలుస్తోంది.