Advertisement
Google Ads BL

యూట్యూబర్స్ తో పెట్టుకున్నాడు.. ఊరుకుంటారా?


బిగ్ బాస్ కి వెళ్ళక ముందు ఒకలా వెళ్లొచ్చాక విన్నర్ అయ్యాక ఒకలా బిహేవ్ చేస్తున్నాడంటూ పల్లవి ప్రశాంత్ పై యూట్యూబర్స్ పీకలదాకా పెట్టుకున్నారు. బిగ్ బాస్ కి వెళ్ళకముందు యూట్యూబ్ చానల్స్ చుట్టూ, ఇన్ఫ్లు ఎన్సర్స్ చుట్టూ తిరిగి తనని బిగ్ బాస్ లో సపోర్ట్ చెయ్యమని అడిగిన పల్లవి ప్రశాంత్ ఇప్పుడు విన్నర్ అయ్యాక యూట్యూబర్స్ ని తన చుట్టూ తిప్పుకుంటూ ఇంటర్వూస్ ఇవ్వకుండా కండిషన్స్ పెడుతున్నాడు, తన ఇల్లు, పొలము, తన వాళ్ళని చూపించమని అడుగుతున్నాడు, అతనికి యాటిట్యూడ్ బాగా పెరిగింది అంటూ యూట్యూబర్స్ తమ ఛానల్స్ నుంచే వీడియోస్ వదులుతున్నారు. మరి పల్లవి ప్రశాంత్ ఎవ్వరితో పెట్టుకున్నా పెట్టుకోకపోయినా.. ఛానల్స్ తో పెట్టుకున్నాడు, వదులుతారా తాట తీసి వదులుతారు. ఇప్పుడదే జరిగింది.

Advertisement
CJ Advs

కిర్రాక్ ఆర్పీ చేపల పులుసుని ప్రమోట్ చెస్తూ ఆర్పీ నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసుని వైరల్ చేసి హిట్ చేసిన యూట్యూబ్ ఛానల్స్ ఆర్పి విషయంలో ఎలా వ్యవహరించాయి.. కర్రీ పాయింట్ విషయంలో ఆర్పీ ని ఎలా హీరోని చేశాయో చూసాం. కానీ పల్లవి ప్రశాంత్ విన్నర్ అవ్వగానే గెలుపు మదం ఎక్కి కొట్టుకుంటూ యూట్యూబర్స్ ని అవమానించడం అనేది ఎవరికి నష్టం. పల్లవికే నష్టమంటూ నెటిజెన్స్ కూడా మాట్లాడుతున్నారు.

అన్నపూర్ణ స్టూడియోస్ చుట్టూ గంటల తరబడి వెయిట్ చేయించి, ఎవ్వరికి ఇంటర్వూస్ ఇవ్వకుండా, ఎవ్వరి ఆదేశాలు ఖాతర్ చెయ్యకుండా అభిమానులతో ర్యాలీలు తీసి పోలీస్ కేసులు పెట్టించుకుని తమ ఊరికి వెళ్లి అక్కడ కూడా ఇంటర్వూస్ ఇవ్వకుండా వాళ్ళని వెయిట్ చేయించి స్నేహితులతో వాళ్ళని అవమానిస్తే ఊరుకుంటారా. పల్లవి ప్రశాంత్ పొగరు దించేవరకు నిద్రపోరు, ప్రస్తుతం సోషల్ మీడియాలో అదే జరుగుతుంది. బిగ్ బాస్ కి వెళ్లక ముందు ఒకలా, వెళ్లి విన్నర్ అయ్యాక మరోలా పల్లవి ప్రశాంత్ యాటిట్యూడ్ ఉంది అంటూ రేవెట్టేస్తున్నారు.

Youtube channel fires on Pallavi Prashanth:

Youtube channel fires on Pallavi Prashanth attitude
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs