బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ గా బయటికొచ్చి ఆ సక్సెస్ ని అభిమానుల ర్యాలీలతో ఎంజాయ్ చేద్దామనుకున్న పల్లవి ప్రశాంత్ కి ఆయన అభిమానులే షాకిచ్చారు. పల్లవి ప్రశాంత్ అభిమానులు అమర్ దీప్ కారుపై, గీతూ రాయల్, అశ్విని కార్లపై రాళ్ల దాడి చెయ్యడమే కాదు, RTC బస్సులపై కూడా దాడి చెయ్యడంతో ఆ కేసు పల్లవి ప్రశాంత్ పైకి వెళ్ళింది. ఇక యూట్యూబ్ ఛానల్స్ కూడా పల్లవిని ఇంటర్వ్యూ చెయ్యాలని కాచుకుని కూర్చున్నారు. కానీ పల్లవి ప్రశాంత్ వాళ్ళకి ఇంటర్వూస్ ఇవ్వకపోగా.. కొన్ని కండిషన్స్ పెట్టాడు.
దానితో కాస్త పేరున్న యూట్యూబ్ ఛానల్స్ యాంకర్స్ పల్లవి ప్రశాంత్ పై ఆగ్రహం వ్యక్తం చేసారు. యాంకర్ శివ అయితే తనని అన్నపూర్ణ స్టూడియోస్ ఎదుట 18 గంటలు, ప్రశాంత్ ఊరిలో తన ఇంటి దగ్గర ఎనిమిది గంటలు వెయిట్ చేయించాడు, ఆ తర్వాత తనకి ఇంటర్వ్యూ ఇచ్చేది లేదని చెప్పిన సమాధానం నచ్ఛలేదు అంటూ చెప్పాడు. అయితే ఇదంతా చూసిన పల్లవి ప్రశాంత్ కూడా ఓ వీడియో రిలీజ్ చేసాడు. జై జవాన్-జై కిసాన్ అంటూ ఆ వీడియోలో పల్లవి ప్రశాంత్ అన్నా నేను మల్లా వచ్చినా.. నాకు చాలా బాధగా ఉంది, ఇది బాధపడే రోజు.
రైతు బిడ్డ గెలిచిండు అని నా ఊరు నాకు ఘన స్వాగతం పలికింది. అన్నా మీడియా వాళ్లంతా మీరే చూసిండ్రు, ఇంతమంది ప్రజలు నాకోసం వచ్చిండ్రు అని సంతోషం ఉన్నా.. ఆ సంతోషం నాకు లేకుండా చెయ్యాలకుంటున్నారు. నిజంగా బాధగా ఉంది. ఏడుద్దామనుకుంటే మీరు నెగెటివ్ చేస్తారని భయంగా ఉంది. 60 నుంచి 70 యూట్యూబ్ ఛానల్స్ వచ్చాయి. నేను వీడియోస్, ఫొటోస్ ఇచ్చాను. నేను అన్నం కూడా తినలేదు, అయినా కొంతమంది వచ్చి ఓ ఐదు నిముషాలు ఇవ్వు, పది నిముషాలు ఇవ్వు అంటూ నా వెంట పడుతున్నారు. నేను మనిషినే కదా అన్నా, నా వల్ల ఐతాల్లేదు అని చెప్పినా వినారా అన్నా అంటూ పల్లవి ప్రశాంత్ ఆ వీడియో లో చెప్పుకొచ్చాడు.