Advertisement
Google Ads BL

పూజని హరీష్ శంకర్ కూడా పట్టించుకోలా?


ప్రస్తుతం సౌత్ లో పూజ హెగ్డే కి బ్యాడ్ టైమ్ నడుస్తుంది. బాలీవుడ్ లో అతి పెద్ద డిసాస్టర్ తో ఉన్న పూజ హెగ్డే ని హరీష్ శంకర్ దువ్వాడ జగన్నాధం డీజేలో అవకాశం ఇచ్చాడు. అంతకుముందు పూజ హెగ్డే ఒకటిరెండు సినిమాలు తెలుగులో చేసినా అనుకున్న క్రేజ్ రాలేదు. కానీ డిజెలో పూజ హెగ్డే బికిని షో వేరే లెవల్ లో ఉండడంతో ఆమెకి టాలీవుడ్ లో వరసగా స్టార్ హీరోల అవకాశాలు తలుపు తట్టాయి, అల్లు అర్జున్, ఎన్టీఆర్, రామ్ చరణ్, ప్రభాస్ ఇలా వరసగా టాప్ హీరోలతో సినిమాలు చేసింది.

Advertisement
CJ Advs

అయితే గుంటూరు కారం నుంచి పూజ హెగ్డే ని  తప్పించాక అమ్మడుకి బ్యాడ్ టైమ్ స్టార్ట్ అయ్యింది. గత ఏడాది వరసగా ప్లాప్స్ ఉండడంతో త్రివిక్రమ్ కూడా పూజ హెగ్డే ని పక్కనబెట్టేశారు. అదే క్రమంలో పవన్ కళ్యాణ్ తో ఉస్తాద్ భగత్ సింగ్ లో పూజనే హీరోయిన్ అని ప్రచారం జరిగినా ఆ ప్లేస్ లోకి శ్రీలీల వచ్చి చేరింది. సరే పవన్ కళ్యాణ్ సినిమాలో హరీష్ శంకర్ పూజ హెగ్డే తప్పించాడు అనుకున్నా.. మరోసారి హరీష్ పూజాకి మొండి చెయ్యి చూపించాడు.

రవితేజ – హరీష్ శంకర్ కాంబోలో తెరకెక్కబోతున్న మిస్టర్ బచ్చన్ మూవీలో పూజ కి ఛాన్స్ ఇవ్వకుండా భాగ్యశ్రీ బోర్స్ అనే కొత్త భామ ని తీసుకొచ్చారు. ముందు రవితేజకి జోడిగా పూజ హెగ్డే నే అనుకున్నాడట హరీష్. కానీ ఏమైందో ఏమో ఫైనల్ గా భాగ్యశ్రీ బోర్స్ వచ్చి చేరింది. మరి తనకి లైఫ్ నిచ్చిన హరీష్ శంకర్ కూడా తనని పక్కనపెట్టెయ్యడం పూజ హెగ్డే కి షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి.

Harish Shankar who kept Pooja aside:

Bhagyashri Borse Comes On Board For Ravi Teja, Harish Shankar movie
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs