ప్రశాంత్ వర్మ-తేజ సజ్జా కలయికలో ప్యాన్ ఇండియా మూవీ హనుమాన్ అనగానే అందరిలో ఆశ్చర్యమూ, అనుమానాలు మొలకెత్తాయి. ఇంత చిన్న హీరోతో ప్రశాంత్ వర్మ విజువల్ వండర్ గా హనుమాన్ ని ఎలా సృష్టిస్తాడో అని. కానీ అందరి అంచనాలు తారుమారు చేస్తూ ప్రశాంత్ వర్మ హనుమాన్ ని ప్రేక్షకులు మెచ్చే విధంగా తీర్చిదిద్దాడు. హనుమన్ పోస్టర్స్ తోనే అంచనాలు క్రియేట్ చెయ్యగలిగాడు. సంక్రాంతి బరిలో నిలిపి మరింత టెన్షన్ పెట్టాడు. అసలు హనుమాన్ కి అంత సీన్ ఉందా.. పండగ బరిలో నిలిచే సినిమానేనా అని మట్లాడుకున్నవారికి ట్రైలర్ తోనే నోరు మూయించాడు.
హనుమాన్ నుంచి తాజాగా వదిలిన ట్రైలర్ లోకి వెళితే.. హనుమంతుడి శ్తొత్రాలతో డివోషనల్ గా ఈ ట్రైలర్ ఇంట్రెస్టింగ్‌గా ప్రారంభమైంది. నీ పేరేంటి అన్నయ్య అని పిల్లలు అడిగిన ప్రశ్నకు హనుమాన్ అని తేజా సజ్జా తన యాక్షన్ తోనే సమాధానం చెబుతూ కుస్తీ వీరులను ఒక్క దెబ్బతో మట్టి కరిపించినట్లుగా కనిపించాడు. విలన్ వినయ్ రాయ్.. పవర్ సూట్‌లో ఉంటే సరిపోదు నాలో ఉండాలి. నా నరనరాల్లో ఉండాలి అంటూ భారీ డైలాగ్ చెబుతూ పవర్ ఫుల్ గా కనిపించాడు. వరలక్ష్మి శరత్‌కుమార్ మరోసారి తన నటనతో చేసిన యాక్షన్ ఎపిసోడ్ ఆకట్టుకుంటుంది. ట్రైలర్ చివరలో మానవాళి మనుగడను కాపాడటానికి నీ రాక అనివార్యం హనుమా అనే డైలాగ్ ట్రైలర్‌కు హైలైట్‌గా నిలిచింది.
హనుమాన్ తో ప్రేక్షకులని మరో లోకానికి తీసుకెళ్లాడు ప్రశాంత్ వర్మ
ట్రైలర్ విజువల్స్, గ్రాఫిక్స్ హాలీవుడ్ స్థాయిలో ఉన్నాయి.
హనుమాన్ గా తేజ విశ్వరూపాన్ని ప్రదర్శించాడు
తమ్ముడి కోసం పోరాటం చేసే అక్కగా వరలక్ష్మి శరత్ కుమార్ కేరెక్టర్ మరియు యాక్టింగ్ సూపర్.
బ్యాగ్రౌండ్ స్కోర్ అద్భుతః.