Advertisement
Google Ads BL

విన్నర్ అయ్యాక యాటిట్యూడ్ చూపిస్తున్నాడు


బిగ్ బాస్ హౌస్ లో ముసుగు వేసుకుని మంచి వాడిలా నటించిన పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ విన్నర్ గా ట్రోఫీ అందుకోగానే అసలు రంగు బయటపెట్టాడా.. అంటే అవుననే సమాధానమే వస్తుంది. బిగ్ బాస్ సీజన్ 7 లో రైతు బిడ్డగా  సింపతిని క్రియేట్ చేసుకోవడానికి హౌస్ లో మంచివాడు అనే ముసుగు వేసుకున్నాడు. అతన్ని టార్గెట్ చేసిన వాళ్ళని బయటికి పంపే స్కెచ్ తోనే పీఆర్ టీమ్ ని నడిపించాడు. ఇక విన్నర్ గా బయటకొచ్చేసరికి వేలాదిగా పల్లవి ప్రశాంత్ అభిమానులమంటూ రన్నర్ అమర్ పై దాడి చెయ్యడమే కాదు, అతని ఫ్యామిలీపై దాడి చేసారు. దానితో పల్లవి ప్రశాంత్ పై పోలీసులు కేసు పెట్టారు.

Advertisement
CJ Advs

ఇక తమ విజయాన్ని సంతోషంగా జరుపుకోనివ్వడం లేదు అంటూ పల్లవి ప్రశాంత్ పోలీసులనే వీడియోస్ తీయించిన విజువల్స్ చూసి పల్లవి ప్రశాంత్ కి ఎంత యాటిట్యూడ్ అంటున్నారు. ఇక బిగ్ బాస్ కి వెళ్లక ముందు యూట్యూబ్ ఛానల్స్ కి ఇంటర్వూస్ ఇచ్చి తనని తాను ప్రమోట్ చేసుకున్న పల్లవి ప్రశాంత్ విన్నర్ అయ్యాక అదే యూట్యూబ్ ఛానల్స్ తో రూడ్ గా బిహేవ్ చేసాడు. గంటలు గంటలు తన ఇంటర్వ్యూ కోసం వెయిట్ చేయించాడు. మీకు ఇంటర్వ్యూ ఎందుకివ్వాలా.. మీరేమన్నా రైతులకి సహాయం చేసారా అంటూ మాట్లాడుతున్నాడు. అటు పోలీసులు రైతు బిడ్డని తొక్కేస్తున్నారంటూ మారోసారి సింపతీ గేమ్ ఆడాడు.

ఇక యూట్యూబ్ ఛానల్స్ కి ఇక్కడ పోలీసుల పర్మిషన్ లేదు.. ఇంటికి రండి ఇంటర్వూస్ ఇస్తా అంటూ పల్లవి ప్రశాంత్ చెప్పగా సదరు యూట్యూబర్స్ పల్లవి ప్రశాంత్ ఇంటికి వెళ్లగా అక్కడ కూడా తమని వెయిట్ చేయించడంతో ఫైర్ అవుతున్నారు. బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్, యూట్యూబ్ యాంకర్ శివ అయితే పల్లవి ప్రశాంత్ పై చేసిన ట్వీట్ వైరల్ అయ్యింది. బిగ్ బాస్ బయట 18 గంటలు వెయిట్ చేయించి ఇంటికి రా అన్నా ఇంటర్వ్యూ ఇస్తా అన్నాడు.. తీరా ఇంటికెళ్ళాక మరో ఎనిమిది గంటలు వెయిట్ చేయించి ఇంటర్వ్యూ ఇవ్వను పొమ్మన్నాడు.

గొప్ప విన్నర్ ప్రశాంత్, ఆఖరికి అతని స్నేహితులని కూడా లెక్క చెయ్యడం లేదు, చాలా దురుసుగా కనిపిస్తున్నాడు. ఇవన్నీ నాకు ఇంటర్వ్యూ ఇవ్వనందుకు చెప్పడం లేదు, కానీ అతను చెప్పే విధానమే బాలేదు అంటూ శివ చెప్పాడు. రైతులకి మీరేం చేసారు. చేస్తారు అంటూ విన్నర్ అయ్యాక ప్రశాంత్ కండిషన్స్ పెడుతున్నాడు, బిగ్ బాస్ కి వెళ్ళకముందు లేని ఆలోచన, వెళ్లొచ్చాక విన్నర్ అయ్యాక ఇప్పుడెందుకు వచ్చింది అంటూ శివ మండిపడ్డాడు. దానితో పల్లవి ప్రశాంత్ హౌస్ లో ముసుగు వేసుకునే ఉన్నాడు, అతనికి ఇంత యాటిట్యూడ్ ఎందుకు అంటూ నెటిజెన్స్ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Bigg Boss winner Pallavi Prashanth Attitude:

Bigg Boss 7 Title Winner Pallavi Prashanth Grand Entry Village With Attitude
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs