Advertisement
Google Ads BL

ఆపరేషన్ కొడాలి నాని స్టార్ట్ చేసిన టీడీపీ..!


ఈసారి టీడీపీ ముందు టార్గెట్స్ చాలానే ఉన్నాయి. ఒకటి వైసీపీని ఓడించడం.. మరొకటి ఇష్టానుసారంగా మాట్లాడిన నేతలను ఓడించడం. నిజానికి కొడాలి నానికి గుడివాడ కంచుకోట. ఆయనను అక్కడ దెబ్బ తీయడమంటే మాటలు కాదు. టీడీపీ పట్ల తన నోటికి ఎంత మాట వస్తే అంత మాట అనేస్తారు కొడాలి నాని. టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు నారా లోకేష్‌నే కాదు.. ఇంట్లోని ఆడవారిని సైతం బయటకు లాగి ఇష్టానుసారంగా మాటలు జారారు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని కొడాలి నానికి ఇంటికి పరిమితం చేయాలని టీడీపీ డిసైడ్ అయినట్టుగా తెలుస్తోంది. 

Advertisement
CJ Advs

టిడ్కో ఇళ్లనైనా వదిలారా?

ఈ క్రమంలోనే టీడీపీ ఆపరేషన్ కొడాలి నాని స్టార్ట్ చేసింది. ఎన్నికలకు 4-5 నెలల ముందుగానే వెనిగండ్ల రాముని గుడివాడ నియోజకవర్గం ఇన్‌చార్జిగా నియమించింది. అంటే ఎన్నికల్లో అభ్యర్థిని ఫిక్స్ చేసేసినట్టే. ఆయనకు కొందరు టీడీపీ సీనియర్ నేతలు అండగా ఉన్నారు. వరుస సభలు, సమావేశాలతో రాముకి ఫుల్ సపోర్ట్ ఇస్తున్నారు. ఎమ్మెల్యే కొడాలి నాని ఎన్టీఆర్‌ సొంత నియోజకవర్గమైన గుడివాడ పేరు ప్రఖ్యాతలు మంటగలుపుతున్నారు. క్యాసినో నిర్వహించి గుడివాడ పరువును తీసేశారు. పోనీ పేద ప్రజల కోసం టీడీపీ కట్టించిన టిడ్కో ఇళ్లనైనా కొడాలి నాని వదిలారా? అంటే అదీ లేదు.

కొడాలి నానికి కౌంట్‌డౌన్ స్టార్ట్..

కొడాలి నాని మంత్రిగా ఉన్న సమయంలో చేయని అరాచకాలు లేవు. ఈ నాలుగున్నరేళ్లలో గుడివాడ అభివృద్ధి అనే మాటే లేదు. ఈ క్రమంలోనే అక్కడి జనం కూడా కొడాలి నానిపై వ్యతిరేకతతో ఉన్నారు. ఇప్పుడు వీరికి టీడీపీ గట్టి సపోర్ట్‌గా నిలుస్తోంది. ఈసారి కొడాలి నానిని ఎలాగైనా ఓడించి సత్తా చాటాలని ప్లాన్ చేస్తోంది. రాష్ట్ర స్థాయిలో వైసీపీని ఓడించడాన్ని ఎంతటి టార్గెట్‌గా అయితే పెట్టుకుందో.. గుడివాడలో కొడాలి నానిని ఓడించడం కూడా అంతే టార్గెట్‌గా పెట్టుకుంది.మొత్తానికి ఇక కొడాలి నానికి అయితే కౌంట్‌డౌన్ ప్రారంభమైనట్టేనని రాజకీయ వర్గాల్లో చర్చ అయితే జరుగుతోంది. 

TDP started Operation Kodali Nani..!:

TDP Begins Well-organized Operation Kodali Nani
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs