Advertisement
Google Ads BL

ఇదేం అభిమానమంటూ.. సజ్జనార్ వార్నింగ్


బిగ్ బాస్ హోస్ట్, ఆ బిగ్ బాస్ ని ప్రసారం చేస్తున్న స్టార్ మాకి హైదరాబాద్ సీపీ సజ్జనార్ వార్నింగ్ ఇచ్చారు. దేనికి అంటే నాగ్ హోస్ట్ గా స్టార్ మాలో ప్రసారం అయిన బిగ్ బాస్ సీజన్ 7 ఫినాలే రోజున పల్లవి ప్రశాంత్ అభిమానులు, అమర్ దీప్ అభిమానుల కొట్లాట కాస్తా ప్రభుత్వ ఆస్తులైన TSRTC బస్సులపై విధ్వంసానికి పాల్పడడమే కాకుండా అశ్విని కారు, గీతూ రాయల్ కారు, అమర్ కారు పై రాళ్లు రువ్వి కార్ల అద్దాలు పగులగొట్టిన విషయంలో సీపీ సజ్జనార్ ఫైర్ అవుతూ.. 

Advertisement
CJ Advs

ఇదేం అభిమానం.. 

బిగ్ బాస్-7 ఫైనల్ సందర్భంగా హైదదాబాద్‌ లోని కృష్ణానగర్‌ అన్నపూర్ణ స్టూడియో సమీపంలో ఆదివారం రాత్రి #TSRTC కి చెందిన బస్సులపై కొందరు దాడి చేశారు. ఈ దాడిలో 6 బస్సుల అద్ధాలు ద్వంసం అయ్యాయి. ఈ ఘటనపై జూబ్లీహిల్స్ పోలీస్‌ స్టేషన్‌ లో ఆర్టీసీ అధికారులు ఫిర్యాదు చేశారు. బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ ఫిర్యాదుతో పోలీసులు ఎఫ్ఐఆర్ కూడా నమోదుచేసి.. దర్యాప్తు చేస్తున్నారు. 

అభిమానం పేరుతో చేసే పిచ్చి చెష్టలు సమాజానికి శ్రేయస్కరం కాదు. ప్రజలను సురక్షితంగా, క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చే ఆర్టీసీ బస్సులపై దాడి చేయడమంటే సమాజంపై దాడి చేసినట్టే. ఇలాంటి ఘటనలను టీఎస్ఆర్టీసీ యాజమాన్యం ఏమాత్రం ఉపేక్షించదు. టీఎస్ఆర్టీసీ బస్సులు ప్రజల ఆస్తి. వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది.. అంటూ హోస్ట్ నాగార్జునని, స్టార్ మా ని ట్యాగ్ చేసారు ఆయన. 

CP Sajjanar Warning to the fandom:

CP Sajjanar Warning to the Prashanth and Amar fandom
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs