Advertisement
Google Ads BL

బయటికొచ్చాక కూడా మారవా.. పల్లవి ప్రశాంత్


బిగ్ బాస్ లోకి కామన్ మ్యాన్ గా రైతు బిడ్డ ట్యాగ్ తో ఎంటర్ అయ్యి హౌస్ లో రకరకాల విన్యాసాలతో చివరికి బిగ్ బాస్ ట్రోఫీని గెలుచుకున్న పల్లవి ప్రశాంత్.. బయట కూడా తన నటనని, సింపతీ గేమ్ ఆపడం లేదు. హౌస్లో రైతు బిడ్డ అంటూ జనాల్లో నాటుకుపోయేలా బిహేవ్ చేస్తూ నామినేషన్స్ లో రెచ్చిపోయేవాడు.  పల్లవి ప్రశాంత్ బయట గట్టి పిఆర్ టీమ్ ని మైంటైన్ చేసాడు. దానితో పల్లవిని హౌస్ లో ఎవరైనా టార్గెట్ చెయ్యగానే బయట ఆయన పిఆర్ టీమ్ వాళ్ళ ఫామిలీస్ ని టార్గెట్ చేసేది.

Advertisement
CJ Advs

ఇక బిగ్ బాస్ లో నాలి ముచ్చులా కనిపిస్తూ టాస్క్ పెరఫార్మెన్స్ చూపించిన పల్లవి ప్రశాంత్ తన మీద నెగెటివిటి పెరుగుతున్నప్పుడల్లా కళ్ళ నీళ్లు పెట్టుకుంటూ సింపతీ కోసం పాకులాడేవాడు. అయితే నిన్న ఆదివారం రాత్రి బిగ్ బాస్ ట్రోఫీతో బయటికొచ్చిన పల్లవి ప్రశాంత్ పై అభిమానంతో హౌస్ లో అతన్ని టార్గెట్ చేసిన అమర్ పై ఆయన ఫ్యామిలీపై పల్లవి ఫాన్స్ రెచ్చిపోయి విధ్వంశం సృష్టించారు . అంతేకాకుండా పల్లవి ఫాన్స్ అమర్ దీప్ అభిమానులతో కొట్లాటకు దిగారు. అమర్ దీప్ కారు, మరో బిగ్ బాస్ కంటెస్టెంట్ అశ్విని, మరో సీజన్ కంటెస్టెంట్ గీతూ రాయల్ కార్ల అద్దాలు పగలగొట్టారు.

దానితో పోలీసులు రంగంలోకి దిగి పల్లవి ప్రశాంత్ ని కారు దిగకుండా అక్కడ నుంచి పంపించే ప్రయత్నం చేశారు. దానితో పల్లవి ప్రశాంత్ ఒక రైతు బిడ్డని గిట్ల అన్యాయం చేస్తారా.. నా కోసం వేలాదిగా అభిమానులు వచ్చారు. అంటూ అరుస్తూ తల కొట్టుకుంటూ బిగ్ బాస్ నుంచి బయటికొచ్చాక కూడా రైతు బిడ్డ సింపతినే ఫాలో అవుతూ కనిపించడంతో అరె నువ్వు మారవా బయటికొచ్చాక కూడా నీ సింపతీ ఏమిట్రా అంటూ ఆడేసుకుంటున్నాడు.  

Will you change even after coming out.. Pallavi Prashanth:

Pallavi Prashanth Grand Entry After Bigg Boss
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs