Advertisement
Google Ads BL

హీరోలకి అందుబాటులో లేని శ్రీలీల


నిన్నమొన్నటివరకు షూటింగ్స్, ప్రమోషన్స్ అంటూ టాలీవుడ్ లో తెగ హడావిడి చేసిన శ్రీలీల ఇప్పుడు హీరోలకి అందుబాటులో లేదట. మహేష్ గుంటూరు కారం మూవీ షూటింగ్ ఫుల్ స్వింగ్ లో ఉన్న సమయంలో శ్రీలీల అందుబాటులో లేదు అనే న్యూస్ అభిమానులని కలవరపెడుతుంది. అయితే శ్రీలీల ప్రస్తుతం ఎగ్జామ్ ఫీవర్ లో ఉందట. శ్రీలీల ఓ వారం రోజుల పాటు షూటింగ్స్ పక్కనబెట్టి తన ఎంబీబీఎస్ ఫైనల్ ఎగ్జామ్స్ రాయడానికి బెంగుళూరు వెళ్లిపోయిందట.

Advertisement
CJ Advs

మరి గుంటూరు కారం సాంగ్స్ షూట్ జరుగుతుంది. ఈ సమయంలో శ్రీలీల లేకపోతే ఎలా అని అభిమానులు ఆందోళన పడుతున్నారు. శ్రీలీల వారం అందుబాటులో లేకపోతే గుంటూరు కారం షూటింగ్ కూడా పక్కనపెట్టెయ్యాలి. కానీ ఇప్పటికే శ్రీలీల పార్ట్ షూట్ పూర్తయ్యింది. ఒక్క సాంగ్ మాత్రమే బ్యాలన్స్ ఉంది అంటున్నారు. అది కూడా 21 నుంచి మొదలు పెడతారట. మరి ఈలోపు శ్రీలీల వచ్చేస్తుందా అంటే అది స్పెషల్ సాంగ్ లో ఆమె అక్కర్లేదు అంటున్నారు. 

మరోపక్క రీలీల విజయ్ దేవరకొండ VD13 లో హీరోయిన్. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో VD13 మూవీ వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి పట్టాలెక్కనుంది. సో ఆ యూనిట్ నుంచి తొందర లేదు. కాని గుంటూరు కారం పరిస్థితే ఎలా ఉంటుందో. ఎందుకంటే గుంటూరు కారం విడుదలకి ఇంకా నెల సమయం లేదు.

Sreeleela Takes Leave From Acting For A Week!:

Is Sreeleela taking a break from movies? 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs