Advertisement
Google Ads BL

వాళ్ళ వెనుక శక్తి, నేనే విన్నర్: శివాజీ


బిగ్ బాస్ లో విన్నర్ అవుదామనుకుని చివరికి టాప్ 3 తోనే సరిపెట్టుకున్న శివాజీ అంతగా టాప్ 3 కి పడిపోవడానికి కారణం మొదటి నుంచి స్టార్ మా బ్యాచ్ అమర్ దీప్ ని శోభా శెట్టి ని, ప్రియాంకని కావాలని టార్గెట్ చెయ్యడం, ముఖ్యంగా అమర్ ని కెప్టెన్ కాకుండా అడ్డుకోవడమే శివాజీని నెటిజెన్స్ తొక్కేయ్యడానికి ప్రధాన కారణం. ఇక పల్లవి ప్రశాంత్, యావర్లని శిష్యులుగా చేసుకుని వారి ఆటకి దిశా నిర్దేశం చేసిన శివాజీ స్పై బ్యాచ్ ని నడిపించాడని బయట ఉన్న టాక్ ని నాగార్జున కూడా చెప్పారు.

Advertisement
CJ Advs

అయితే శివాజీ టాప్ 3 నుంచి బయటికి వచ్చాక  BB బజ్ ఇంటర్వ్యూలో గీతూ తో కలిసి పాల్గొన్నాడు. మీరు టాప్ 3 నుంచి బయటికి వచ్చారు మీ ఫీలింగ్ ఏమిటి అనగానే నేనే విన్నర్ అంటూ చెప్పిన ప్రోమో వైరల్ గా మారింది. ఆ తర్వాత మీరు అమర్ ని టార్గెట్ చెయ్యడం వల్లే విన్నర్ కాలేకపోయారని ఆడియన్స్ మాట మీరేమంటారు అనగానే ఎక్కడో పల్లెటూరు నుంచి వచ్చి కష్టపడుతుంటే డే 1 నుంచి కిందకిలాగడం నాకు నచ్చకే నేను ఇలా చేశాను, పల్లవి ప్రశాంత్ కి అండగా నిలబడ్డాను అన్నాడు. 

అమర్ కెప్టెన్ కాకుండా శతవిధాలా పోరాడారు దేనికి మీరేమంటారు అని గీతూ అడిగితే నేను అమర్ దీప్ మంచి ఫ్రెండ్స్ అంటూ కవర్ చేసుకున్నాడు. ఆ తర్వాత పల్లవి ప్రశాంత్, యావర్ ల వెనుక శక్తిగా ఉన్నాను అంటూ శివాజీ చెప్పిన సమాధానం వింటే ఆడియన్స్ కూడా షాకవ్వాల్సిందే. ఇంకా గీతూ ఏదో అడగబోతుంటే నేను నీకు సమాధానాలు చెప్పాల్సిన అవసరం లేదు అంటూ తప్పించుకున్న ప్రోమో వైరల్ గా మారింది. 

Shivaji BB Buzz interview:

Shivaji Bigg Boss Buzz Interview After Elimination
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs