Advertisement
Google Ads BL

BB విన్నర్ ఎంత గెలుచుకున్నాడంటే?


105 రోజులుగా బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తూ వస్తోన్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 7‌కు ఆదివారంతో తెరపడింది. రైతు బిడ్డగా హౌస్‌లోకి అడుగుపెట్టిన పల్లవి ప్రశాంత్ ఈ సీజన్ విన్నర్‌గా నిలిచాడు. వాస్తవానికి మొదటి నుండి శివాజీ విన్నర్ అవుతాడని అంతా ఊహిస్తూ వచ్చారు. కానీ, చివరి నిమిషంలో శివాజీ చేసిన పొరబాట్లు, సోషల్ మీడియాలో అతని నెగిటివ్ వీడియోలు వైరల్ అవడంతో ఓటింగ్‌లో తేడా వచ్చింది. దీంతో శివాజీ రన్నర్‌గా కూడా నిలవలేకపోయాడు. అమర్ దీప్ రన్నరప్ స్థానం సొంతం చేసుకోగా.. టాప్ 3 స్థానంతో శివాజీ సరిపెట్టుకోవాల్సి వచ్చింది. 

Advertisement
CJ Advs

అయితే ఒక రోజు ముందే పల్లవి ప్రశాంత్ విన్నర్ అని లీక్స్ వచ్చేసినా.. ప్రేక్షకులు ఫినాలే చూసేందుకు టీవీలకు అతుక్కుపోయారు. కారణం, ఈ సీజన్ జనాలకు బాగా దగ్గరైంది. లీక్స్ నిజమేనా? అని కొందరు, బిగ్ బాస్ లాస్ట్ ఎపిసోడ్ అని మరికొందరు బిగ్ బాస్‌కు కనెక్ట్ కావడంతో.. ఈ గ్రాండ్ ఫినాలే మంచి టీఆర్పీనే సొంతం చేసుకుంది. మరోవైపు భారత్, దక్షిణాఫ్రికాల మధ్య జరిగిన వన్డే క్రికెట్ మ్యాచ్ కూడా తొందరగా ముగియడం బాగా కలిసొచ్చింది. మొత్తంగా అయితే ఈ సీజన్ సక్సెస్‌ఫుల్‌గా కొనసాగిందనే చెప్పుకోవచ్చు. 

ఇక విన్నర్ పల్లవి ప్రశాంత్ గెలుచుకున్న వాటి విషయానికి వస్తే.. టాప్ 4 స్థానం సొంతం చేసుకున్న ప్రిన్స్ యావర్ రూ. 15 లక్షల సూట్ కేసు తీసుకుని హౌస్ నుండి ఎలిమినేట్ కాగా.. టాప్ 2, 3 స్థానాలలో నిలిచిన వారికి మాత్రం ఏం దక్కలేదు. విన్నర్ ప్రశాంత్ నీల్‌కు మాత్రం రూ. 35 లక్షల క్యాష్‌తో పాటు.. మారుతి సుజుకీ వితారా బ్రెజా కారు, రూ. 15 లక్షల విలువైన డైమండ్ జ్యూయలరీ గెలుచుకున్నాడు. అయితే మొదటి నుండి అందరూ శివాజీ గెలుస్తాడని అనుకున్నారు కానీ.. హౌస్‌లో ఆయన నిలబెట్టిన పల్లవి ప్రశాంత్ విన్నర్ కావడంతో.. శివాజీ కూడా హ్యాపీగానే కనిపించారు. అలాగే రన్నర్ అమర్ దీప్ కూడా ప్రశాంత్ విజయంపై సంతోషాన్ని తెలియజేశాడు. ఇలా బిగ్ బాస్ సీజన్ 7 ఉల్టా పుల్టా షో ముగిసింది.

Pallavi Prasanth Wins Cash, Car and Gold and Diamond:

Pallavi Prasanth is the Bigg Boss Season 7 Winner    
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs