Advertisement
Google Ads BL

బిగ్ బాస్ 7 : పాపం శివాజీ


బిగ్ బాస్ సీజన్ 7 లో చాణుక్యుడిగా గేమ్ ఆడుతూ భుజానికి దెబ్బతగిలినా లెక్క చెయ్యకుండా టాప్6 లోకి వచ్చిన శివాజీ ఒకొనొక సమయంలో గేమ్ ఛేంజర్, అతనే బిగ్ బాస్ టైటిల్ విన్నర్ అవుతాడని అన్నారు. నిజంగానే శివాజీ మైండ్ గేమ్ వలన చాలామంది కంటెస్టెంట్స్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యారు. అయితే శివాజీ పల్లవి ప్రశాంత్, యావర్ లని తన శిష్యులుగా మార్చుకుని హౌస్ లో స్పై బ్యాచ్ ని తయారు చేసాడని నాగార్జున చెప్పారు. 

Advertisement
CJ Advs

శివాజీ కి కాస్త టెంపర్మెంట్ ఎక్కువే. మాట్లాడితే హౌస్ నుంచి బయటికి వెళ్ళిపోతా బిగ్ బాస్ అంటూ బిగ్ బాస్ నే బెదిరించేవాడు. ఇక టైటిల్ రేస్ లో ఉన్న శివాజీ వెనకపడిపోయి పల్లవి ప్రశాంత్ టాప్ 1 లోకి టైటిల్ ఫేవరేట్ గా మారడానికి ప్రధాన కారణం శివాజీ అమర్ దీప్ ని టార్గెట్ చెయ్యడమే. అమర్ దీప్ విషయంలో శివాజీ చేసిన ప్రతి పని అతను టైటిల్ రేస్ నుచి కిందకి జారిపోవడానికి ప్రధాన కారణంగా కనిపించింది. మొదటి నుంచి స్టార్ మా బ్యాచ్ అంటూ అమర్ దీప్, శోభా శెట్టి, సందీప్ మాస్టర్, ప్రియంకలపై శివాజీ విషం చిమ్మడం ప్రేక్షకులకి నచ్ఛలేదు.

ఇక చివరి రెండు వారాల్లో శోభా శెట్టి, ప్రియాంకలపై శివాజీ చేసిన కామెంట్స్ అతనికి మరింత నెగిటివిటిని తెచ్చిపెట్టాయి. శోభా, ప్రియాంకలని ఉద్దేశించి మా ఇంట్లో ఇలాంటి అమ్మాయిలు ఉంటే గొంతు మీద కాలేసి తొక్కుతాను అంటూ సంచలనంగా మాట్లాడి బయట అమ్మాయిలకి టార్గెట్ అయ్యాడు. అక్కడే శివాజీ గ్రాఫ్ పూర్తిగా పడిపోయి.. మరోపక్క అమర్ దీప్ కి సింపతీ వర్కౌట్ అవడంతో శివాజీ కనీసం రన్నర్ స్థానంలోకి రాలేకపోయాడు. పల్లవి ప్రశాంత్ విన్నర్ కాగా.. అమర్ దీప్ రన్నర్ అయ్యాడు. విన్నర్ అవుతాడనుకున్న శివాజీ మూడో స్థానంలో ఎలిమినేట్ అవడంతో అందరూ పాపం శివాజీ అంటున్నారు.

BB7 : Sivaji Eliminated and Stands In 3rd Place:

Bigg Boss 7 : Sivaji Eliminated and Stands In 3rd Place
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs