Advertisement
Google Ads BL

మహేష్ వార్నింగ్.. ఓ మై బేబీ డౌటే?


సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న గుంటూరు కారం సినిమా నుండి వచ్చిన సెకండ్ సింగిల్‌పై ఏ రేంజ్‌లో ట్రోలింగ్ నడుస్తుందనేది.. సోషల్ మీడియా ఫాలో అయ్యేవారికి ఓ అవగాహన వచ్చేసింది. ముఖ్యంగా ఈ పాట ఫ్యాన్స్‌కి కూడా నచ్చలేదు. దీంతో.. సోషల్ మీడియా వేదికగా సంగీత దర్శకుడు థమన్‌ని, లిరిక్ రైటర్ రామజోగయ్య శాస్త్రిని బాగా ట్రోల్ చేస్తున్నారు. ఈ ట్రోల్ భరించలేక రామజోగయ్య శాస్త్రి కంట్రోల్ తప్పితే.. నిర్మాత నాగవంశీ కోతులు అంటూ పెద్ద పదమే వాడేశాడు. 

Advertisement
CJ Advs

అయితే ఈ గోలంతా మహేష్ బాబు వరకు చేరినట్లుగా తెలుస్తోంది. ఫ్యాన్స్ అభిప్రాయాలను గౌరవించకుండా.. వారిపై ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడటంపై ఆయన సీరియస్ అయినట్లుగా టాక్ వినిపిస్తోంది. దీంతో అసలు సినిమాలో ఈ సెకండ్ సింగిల్ ఓ మై బేబీ ఉంటుందా? అనేలా అనుమానాలు మొదలయ్యాయి. మొదటి నుండి ఫ్యాన్స్‌కి మహేష్ బాబు చాలా ప్రాముఖ్యత ఇస్తూ వస్తుంటారు. అది సూపర్ స్టార్ కృష్ణ దగ్గర నుండి ఉంది. తన విషయంలో ఫ్యాన్స్ ఒక్కోసారి హద్దులు దాటినా కూడా మహేష్ ఎప్పుడూ పబ్లిక్‌గా టార్గెట్ చేయలేదు. ఫ్యాన్స్‌కి ఆయన అంత ఇంపార్టెన్స్ ఇస్తారు. 

అలాంటిది ఫ్యాన్స్, ప్రేక్షకులు అని లేకుండా.. ప్రతివాడూ మాట్లాడే వాడే... రాయి విసిరే వాడే. అభిప్రాయం చెప్పేదానికి ఒక పద్ధతి ఉంటుంది. పాట నిడివి తప్ప నిన్నటి పాటకు ఏం తక్కువైందని? మీకన్నా ఎక్కువ ప్రేమే మాక్కూడా.. అదే లేకపోతే, ప్రేమించకపోతే మా పని మేం గొప్పగా చెయ్యలేం... తెలసుకుని ఒళ్లు దగ్గరపెట్టుకుని మాట్లాడండి.. అని రామజోగయ్య శాస్త్రి ట్విట్టర్ ఎక్స్‌లో సీరియస్‌గా పోస్ట్ చేసి.. ఆ తర్వాత ఆ అకౌంట్‌కే గుడ్ బై చెప్పేశారు. రామ్‌జో హర్ట్ అవడంపై స్పందిస్తూ.. నిర్మాత నాగవంశీ యానిమల్ సినిమాలోని మంకీ ఎపిసోడ్‌ వీడియోని షేర్ చేసి మరింతగా బుక్కయ్యాడు. ఇదంతా మహేష్‌కి తెలిసి.. కామ్‌గా ఉంటే పోయేదానికి ఏంటి ఇది అని.. చిత్రయూనిట్‌కు చిన్నపాటి వార్నింగ్ కూడా ఇచ్చినట్లుగా టాలీవుడ్ సర్కిల్స్‌లో టాక్ వినిపిస్తోంది.

Mahesh Babu Warning To Guntur Kaaram Unit:

Doubts on Guntur Kaaram Oh My Baby Song 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs