Advertisement
Google Ads BL

రైతు బిడ్డ పల్లవినే వరించిన BB7 ట్రోఫీ


బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ పై బుల్లితెర ప్రేక్షకులు ఎక్స్ పెక్ట్ చేసిందే జరిగింది. సీజన్ మిడిల్ నుంచే రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ విన్నర్ అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరిగినట్టుగానే ఈ సీజన్ బిగ్ బాస్ ట్రోఫీని రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ ఎగరేసుకుపోయాడు. మొదట్లో పల్లవి ప్రశాంత్, శివాజీ మధ్యలో విన్నర్ ట్రోఫీ దోబూచులాడింది.. శివాజీ అమ్మాయిలైన శోభా శెట్టి, ప్రియాంకలపై చేసిన కామెంట్స్ అయన గ్రాఫ్ తగ్గించాయి. ఇక ఈ సీజన్ మొదటి వారం నుంచి వీక్ కంటెస్టెంట్ గా ప్రొజెక్ట్ అయిన అమర్ దీప్ లక్కీగా రెండోస్థానం లోకి వచ్చేసి బిగ్ బాస్ సీజన్ 7 రన్నర్ గా నిలిచాడు.

Advertisement
CJ Advs

రేపు ఆదివారం సాయంత్రం 7 గంటలకు ప్రసారం చెయ్యబోయే ఎపిసోడ్ షూట్ జరగడం, ఆ షూట్ లీకులు వరసగా సోషల్ మీడియాలో రావడం చూస్తున్నాం. టాప్ 6 నుంచి ముందుగా అర్జున్ అంబటి ఎలిమినేట్ అవ్వగా.. ఐదో స్థానంలో ప్రియాంక అవుట్ అయ్యింది. ఆ తర్వాత యావర్ కి పరిస్థితి అర్ధమయ్యి 15 లక్షల సూట్ కేసుతో నాలుగో కంటెస్టెంట్ గా బయటికి వెళ్ళిపోయాడు. అయితే టాప్ 3 లో అమర్ ఉంటాడని అందరూ భావించారు. పల్లవి విన్నర్, శివాజీ రన్నర్ అనుకున్నారు. కానీ అమర్ దీప్ రన్నర్ గా, శివాజీ మూడో స్థానంలో ఎలిమినేట్ అయ్యి హౌస్ ని వీడి బిగ్ బాస్ స్టేజ్ పైకి వచ్చేసాడు. 

ఇక హౌస్ లోకి ఎంటర్ అయ్యాక రైతు బిడ్డగా సింపతీ క్రియేట్ చేసుకుని జై కిసాన్ అంటూ బయట ఆడియన్స్ మనసులని గెలుచుకున్న పల్లవి ప్రశాంత్ మధ్యమధ్యలో అమాయకంగా నటించినా, అందరికి టార్గెట్ గా మారినా.. తన బలాన్ని నమ్ముకుని టాస్క్ లు ఆడి.. నెటిజెన్స్ మనసులని గెలుచుకుని బిగ్ బాస్ సీజన్ 7 కి విన్నర్ గా నిలిచిపోయి చరిత్ర సృష్టించాడు. 

Pallavi Prashanth Emerges As BB7 winner:

Bigg Boss Telugu 7 Winner: Pallavi Prashanth Lifts The Title Trophy
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs