Advertisement
Google Ads BL

BB7 : 15 లక్షలతో జంప్ అయ్యాడు


బిగ్ బాస్ సీజన్ 7 గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ కి మరికొద్దిగంటల సమయమే ఉంది. ఈ సీజన్ ముగింపు ఎపిసోడ్ కోసం ఈరోజు నుంచే షూట్ స్టార్ట్ చేసింది యాజమాన్యం. నాగార్జున హోస్ట్ గా మొదలైన గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ షూట్ లీకులు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈరోజు ఎపిసోడ్ లో హౌస్ లోకి 10 లక్షల సూట్ కేసు పంపించారు. కానీ హౌస్ మేట్స్ ఎవరూ దానిని తీసుకోలేదు. అయితే గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ లో ఆరుగురిలో అర్జున్ అంబటి ముందుగా ఎలిమినేట్ అయ్యాడు. ఆ తర్వాత ప్రియాంక ఎలిమినేట్ అయ్యింది.

Advertisement
CJ Advs

అయితే ఈ ఇద్దరూ ఎలిమినేట్ అయ్యాక 15 లక్షల సూట్ కేసు నాగార్జున హౌస్ లోకి తీసుకువెళ్లి హౌస్ మేట్స్ ని రకరకాలుగా ఊరించారు. అయితే ఆ సూట్ కేసు కోసం అమర్, శివాజీ, పల్లవి ప్రశాంత్ లు ఆశపడకపోవడంతో యావర్ మాత్రం ఆ 15  లక్షల సూట్ కేసు తీసుకుని ముందుగానే హౌస్ ని వీడినట్లుగా లీకులు చెబుతున్నాయి. సీరియల్స్ లో చిన్న చిన్న రోల్స్ లో కనిపించిన యావర్ బిగ్ బాస్ హౌస్ లో శివాజీ గ్రూప్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా ప్రొజెక్ట్ అయ్యాడు.

అయితే శోభా శెట్టి విషయంలో యావర్ తన బలాన్ని పక్కనపెట్టి ఆమెతో గొడవలు పడి బలహీతగా మారిపోయాడు. దానితో యావర్ గ్రాఫ్ పడిపోయింది. ఇక తనకి డబ్బు చాలా అవసరమని హౌస్ లో పదే పదే చెప్పే యావర్ అర్జున్, ప్రియాంకలు ఎలిమినేట్ అవడం చూసి ఇక తనపై తాను నమ్మకం కోల్పోయి ఈ 15 లక్షల సూట్ కేసు అందుకుని ముందుగానే ఎలిమినేట్ అయినట్లుగా తెలుస్తుంది.

BB7: Prince Yawar Eliminated:

Bigg Boss 7: Prince Yawar Took 15 Lakh Suit Case In This Season
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs