Advertisement
Google Ads BL

బిగ్ బాస్ 7 గ్రాండ్ ఫినాలేకి సెలెబ్రిటీస్ క్యూ


బిగ్ బాస్ సీజన్ 7 ముగింపు దశకు వచ్చేసింది. రేపు ఆదివారమే బిగ్ బాస్ 7 గ్రాండ్ ఫినాలే జరగబోతుంది. ఇప్పటికే బిగ్ బాస్ యాజమాన్యం 24 గంటల లైవ్ ఆపేసింది. ఇక ఈరోజు నుంచి బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే  ఎపిసోడ్ షూట్ మొదలు కాబోతుంది. ఈ రోజు యాంకర్ శ్రీముఖి వచ్చి కంటెస్టెంట్స్ ని ఎంటర్టైన్ చేసిన ఎపిసోడ్ ని ప్రసారం చెయ్యబోతున్నారు. అంటే శనివారం ఎపిసోడ్ కి నాగార్జున రారు. రేపు సాయంత్రం ప్రసారం కాబోయే గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ షూట్ లో నాగ్ పాల్గొంటున్నారు.

Advertisement
CJ Advs

మరి గ్రాండ్ ఫినాలే అంటే ఓ రేంజ్ క్రేజ్ ఉంటుంది. అందుకే టాలీవుడ్ హీరోలు ఈ బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ లో తమ తమ సినిమాల పబ్లిసిటీ కోసం వస్తున్నారు. ఇప్పటికే గ్రాండ్ ఫినాలేలో సీజన్ 7 విన్నర్ ని ప్రకటించేందుకు మహేష్ బాబు రాబోతున్నాడని న్యూస్ ఉండగా.. ఇప్పుడు ఈ ఫినాలే ఎపిసోడ్ లో రవితేజ తన ఈగల్ సినిమా ప్రమోషన్స్ కోసం రాబోతున్నాడట. హీరోయిన్స్ తో కలిసి రవితేజ వస్తాడని అంటున్నారు.

ఇక హీరోయిన్స్ స్పెషల్ డాన్స్ పెరఫార్మెన్స్ లు, సింగెర్స్ పాడే పాటలు, దీనితో పాటుగా యాంకర్ సుమ కొడుకు రోషన్ కనకాల కూడా బబుల్ గమ్ ప్రమోషన్స్, నాగార్జున నా సామిరంగా ప్రమోషన్స్ అంటూ టీమ్స్ బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే ఈవెంట్ కి రాబోతున్నారని తెలుస్తుంది. అంటే ఈరోజు జరగబోయే గ్రాండ్ ఫినాలే షూట్ లో ఈ హీరోలు, డాన్స్ పెరఫార్మెన్స్ లు అన్ని జరుగుతాయని తెలుస్తోంది. రేపు ఈ సమయానికి బిగ్ బాస్ విన్నర్ కూడా తేలిపోయి లీకులు బయటపడతాయని అంటున్నారు.

Celebrities Queue for Bigg Boss 7 Grand Finale:

Bigg Boss 7 Telugu - A juicy update on the grand finale episode
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs