సలార్ విడుదలకు ఒక్క వారం మాత్రమే సమయం ఉంది. మళ్ళీ ఇదే శుక్రవారం సలార్ ప్యాన్ ఇండియా మార్కెట్ లోకి దిగబోతుంది. ప్రభాస్ ని ఎప్పుడెప్పుడు మాస్ కటౌట్‌లో చూద్దామా అని ఆయన అభిమానులే కాదు ప్యాన్ ఇండియా ప్రేక్షకులు కూడా ఎదురు చూస్తున్నారు. సలార్ ప్రమోషన్స్ లేవు కానీ.. సినిమాపై అంచనాలు పెంచే పోస్ట్‌లు సోషల్ మీడియాలో కనిపిస్తూనే ఉన్నాయి. తాజాగా సలార్ సినిమా చాలా బాగా వచ్చింది, అలాగే ఐదు యాక్షన్ సీన్స్ ఉండబోతున్నాయంటూ ఓ ట్వీట్ వైరల్ అవుతోంది.
ఆ యాక్షన్ సీక్వెన్సులో ఇంటర్వెల్ కి ముందు రెండు ఆ తర్వాత మూడు యాక్షన్ సీన్స్ ఉంటాయట. ఈ ఫైట్ సీన్స్ మొత్తం ఒకదాన్ని మించి ఒకటి ఉంటాయి, ఈ యాక్షన్ సీక్వెన్స్ అన్ని ప్రభాస్ మీదే ఉంటాయని సమాచారం. ఇక ప్రభాస్ ఏంటి సినిమా మొదలయ్యాక కాస్త లేట్ అయినా.. ఆ ఎంట్రీ పవర్ ఫుల్‌గా ఉండబోతుందట. ప్రశాంత్ నీల్ ప్రభాస్ కటౌట్ కి సరిపోయేలా దేవా పాత్రని డిజైన్ చేసినట్లుగా చెబుతున్నారు.
ప్రమోషన్ చెయ్యకుండానే సినిమా విడుదల చేసి.. సినిమా విడుదలయ్యాక ఖచ్చితంగా హిట్ అవుతుంది, అప్పుడే పోస్ట్ ప్రమోషన్స్ చెయ్యాలని మేకర్స్ ఏదో డిసైడ్ అయ్యారంటూ మరో వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఏది ఏమైనా సలార్ మూవీ ప్యాన్ ఇండియా హిట్ అవుతుంది అంటూ వస్తున్న వార్తలతో ప్రభాస్ ఫాన్స్ కూల్ అవుతున్నారు. ఇలా ఒక్కసారిగా సలార్ పై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి.