Advertisement
Google Ads BL

స్క్రిప్ట్ రాసుకొచ్చి మరీ జగన్ తిట్లు..!


అలవోకగా ప్రసంగించాలంటే అది అందరికీ సాధ్యం కాదు. కానీ రాజకీయాల్లో ఉన్న వారికి క్రమక్రమేణా అది అలవాటై పోతుంది. కానీ ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్లోకి వచ్చి దశాబ్దాలు గడుస్తోంది కానీ ఆయనకు ప్రసంగాలు ఇంకా అలవాటు కాలేదని తెలుస్తోంది. ఎప్పుడు.. ఎక్కడ ప్రసంగానికి వెళ్లినా ప్రసంగ ప్రతులు లేకుండా మాత్రం వెళ్లరు. ఇదంతా బాగానే  ఉంది కానీ చివరకు ఎవరినైనా తిట్టాల్సి వచ్చినా కూడా ఈ ఉల్లిపాయ ముఖ్యమంత్రి స్క్రిప్ట్‌తో వెళుతుండటం హాట్ టాపిక్‌గా మారింది. దీనిపై సోషల్ మీడియాలో సెటైర్లు వెల్లువెత్తుతున్నాయి.

Advertisement
CJ Advs

తిట్టడంలో కూడా జెన్యూనిటీ లేదు..

ఏవైనా ముఖ్య విషయాలు చెప్పాలంటే వాటిని ఒక పేపర్‌పై రాసుకోవడం వరకూ ఓకే కానీ ఇలా తిట్టడానికి కూడా రాసుకుంటారా? అని జనం అవాక్కవుతున్నారు. రాజకీయ ప్రత్యర్థులైన టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌లను తిట్టాలన్నా కూడా ఆయన స్క్రిప్ట్ పట్టుకుని వెళుతున్నారు. తిట్టడంలో కూడా జెన్యూనిటీ లేదు. చూసి చదివి తిడుతున్నారని నెటిజన్లు మీమ్స్ పెడుతున్నారు. తాజాగా శ్రీకాకుళం జిల్లా, పలాసాలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్‌, సుజలాధార ప్రాజెక్టుల ప్రారంభోత్సవంలో జగన్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎందుకో చంద్రబాబు, పవన్ తిట్టాలని జగన్‌ డిసైడ్ అయినట్టున్నారు. దీనికోసం స్క్రిప్ట్ రాయించుకుని మరీ తెచ్చుకున్నారు. 

కొల్లాపూర్‌లో పోటీ చేస్తే..

1.. 2.. 3.. స్టార్ట్ అని మనసులోనే అనేసుకుని.. ప్రసంగం మొదలవగానే కాగితంపై చంద్రబాబు, పవన్‌లను ఉద్దేశిస్తూ ఉన్న తిట్లన్నీ చూసి అప్పగించేశారు జగన్. అది చూసిన జనాలు అవాక్కయ్యారు. తెలంగాణలో పవన్‌ పోటీ చేయించిన అభ్యర్థులకు కనీసం స్వతంత్ర అభ్యర్ధి బరెలక్కకి వచ్చినన్ని ఓట్లు కూడా ఎవరికీ రాలేదని.. డిపాజిట్లు సైతం కోల్పోయారంటూ ఆనందంగా చెప్పారు. ఆనాడు తెలంగాణలో దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి ముద్దుల కుమారుడిగా.. కొల్లాపూర్‌లో పోటీ చేస్తే.. జగన్‌కు వచ్చిన ఓట్లు 1204 అంటే.. 0.81%... 2023లో స్వంతంత్ర అభ్యర్థి బర్రెలక్కకు వచ్చిన ఓట్లు 5,754 అంటే 2.99%. చరిత్ర మరచి మరీ విమర్శలు చేసి ముసిముసి నవ్వులు నవ్వడం జగన్‌కి మాత్రమే సొంతం.  తాను 16నెలల పాటు జైలుకి వెళ్లిన విషయాన్ని మరిచి 50 రోజుల పాటు జైలుకు వెళ్లారంటూ చంద్రబాబును ఎద్దేవా చేస్తారు. గురివింద తన నలుపెరుగదని.. జగన్ చేసే పనులన్నీ ఇలాగే ఉంటాయి. 

AP CM Ys Jagan Speech:

Jagan seems to have decided to scold Chandrababu and Pawan
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs