Advertisement
Google Ads BL

ఇలా అయితే ముంబై మీడియా తొక్కేస్తుంది


బాహుబలి, ఆర్.ఆర్.ఆర్, పుష్ప తర్వాత సౌత్ సినిమాలంటే భయపడిన బాలీవుడ్ హీరోలు తమ సినిమాలని దక్షిణాదిన తెగ ప్రచారం చేస్తున్నారు. షారుఖ్, సల్మాన్, రణబీర్ ఇలా ఏ హీరో అయినా తమ సినిమాలని టాలీవుడ్, కోలీవుడ్ ఏ ఒక్క భాషనీ వదలకుండా ప్రమోట్ చేస్తూ సౌత్ ప్రేక్షకులకి దగ్గరవుతున్నారు. ఇప్పటికే సౌత్ హీరోలు నార్త్ లో గట్టిగా జెండా పాతేశారు. దానితో బాలీవుడ్ మీడియా కూడా సౌత్ హీరోలని మొయ్యాక తప్పలేదు. ఇక్కడి హీరోలు బాలీవుడ్ లో గట్టిగా పిఆర్ టీమ్ ని కూడా నడిపిస్తున్నారనే టాక్ ఉంది.

Advertisement
CJ Advs

ఇలాంటి పోటీ సమయంలో మన హీరోలు నార్త్ ని లైట్ తీసుకుంటే బాలీవుడ్ మీడియా ఊరుకుంటుందా.. తొక్కిపారేస్తుంది. సౌత్ దర్శకుడు ప్రశాంత్ నీల్, సౌత్ హీరో ప్రభాస్ కలయికలో ప్యాన్ ఇండియా మూవీగా రాబోతున్న సలార్ వచ్చే శుక్రవారం అంటే డిసెంబర్ 22 నే విడుదల కాబోతుంది. ఈ చిత్రానికి సంబందించిన ప్రమోషన్స్ ఇంకా మొదలు కాలేదు. చాలామంది టాలీవుడ్ హీరోలు ముంబైలో కూర్చుని అక్కడ సినిమాని ఎన్ని విధాలుగా ప్రమోట్ చెయ్యొచ్చో అన్ని విధాలుగా చేస్తున్నారు.

కానీ సలార్ టీమ్ ఇప్పటివరకు ఆ ప్రమోషన్స్ మొదలు పెట్టలేదు. కనీసం ట్రైలర్ లంచ్ అయినా ముంబైలో చేస్తారు అనుకుంటే అదీ లేదు. ఇప్పటివరకు ప్రభాస్ అండ్ కో హిందీ లో సలార్ ని ప్రమోట్ చేస్తారో, లేదో క్లారిటీ లేదు. సినిమా విడుదలకి సమయం వచ్చేసింది. సలార్ ని బాలీవుడ్ మీడియా తొక్కేయ్యడానికి ఇదే అదను అని అభిమానులు ఆందోళన పడుతున్నారు. 

Salaar north promotions:

Prabhas Salaar releasing on dec 22nd
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs