Advertisement
Google Ads BL

శాస్త్రిగారికి బాగా కోపమొచ్చింది


లిరికిస్ట్ రామజోగయ్య శాస్త్రిగారికి చాలా కోపమొచ్చింది. కారణం గుంటూరు కారం సాంగ్స్ బాలేదు అని సోషల్ మీడియాలో వచ్చే కామెంట్స్ చూసి శాస్త్రిగారు బాగా హార్ట్ అయినట్టుగా ఉన్నారు. ఇంతకుముందు దమ్ మసాలా సాంగ్ వచ్చింది. దానిపై కూడా నెగెటివ్ కామెంట్స్ పడ్డాయి. కానీ నిన్నొచ్చిన ఓ మై బేబీ సాంగ్ పై ట్విట్టర్ ఓపెన్ చేస్తే విపరీతమైన నెగిటివిటి కనిపించింది. ఆ సాంగ్ ఇంగ్లీష్, తెలుగు పదాలు మిక్స్ చేయడంపై మరింతగా నెగెటివ్ ఇంపాక్ట్ కనిపించింది.

Advertisement
CJ Advs

ఆ పాట చూసాక మహేష్ అభిమానులు.. గురువు గారు మీ మీద ఎక్కువ ఆశలు పెట్టుకున్న ప్రతిసారీ, మీరు మమ్మల్ని ఇలా మోసగించడం బాలేదు.. Lyrics అస్సలు బాలేదు.. దెబ్బేసారు గురువు గారు..

మీరు అల వైకుంఠపురం లో సాంగ్స్ బాగా రాశారు మరీ మహేష్ బాబు కి ఎంటి sir ఇలా రాశారు సాంగ్, 

తెలుగుదనం తక్కువ అయ్యింది. త్రివిక్రమ్ సినిమా అనగానే మెలోడీ సాంగ్స్ సిరివెన్నెల గారు ఎలా రాసేవారో, అది ఈ పాట లో లేదు అంటూ స్పందిస్తున్నారు.

ఈ కామెంట్స్ చూసిన శాస్త్రిగారు కాస్త ఘాటుగానే రియాక్ట్ అయ్యారు.

ప్రతివాడు మాట్లాడేవాడే

రాయి విసిరే వాడే 

అభిప్రాయం చెప్పేదానికి ఒక పధ్ధతి ఉంటుంది

పాట నిడివి తప్ప నిన్నటి పాటకు ఏం తక్కువయ్యిందని 

మీకన్నా ఎక్కువ ప్రేమే మాక్కూడా..అదే 

లేకపోతే.. ప్రేమించకపోతే మా పని మేం గొప్పగా చెయ్యలేం.. తెలుసుకొని ఒళ్ళు దగ్గరపెట్టుకుని మాట్లాడండి.. అంటూ చేసిన ట్వీట్ కి మళ్ళీ మహేష్ అభిమానులు రిప్లై ఇస్తూ నిన్న పాటలో ఏముంది అని 

తక్కువ అయ్యేకి, ఏమైనా ఉంటే కదా తక్కువ ఆయ్యేకి అంటూ మరోసారి హంగామా షురూ చేసారు. 

 

Ramajogayya Sastry was very angry:

Ramajogayya Sastry reacts OH My baby song negative comments
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs