ఈ టివిలో ఢీ డాన్స్ షో మొదలైన కొత్తల్లో ఉదయభాను యాంకరింగ్ చేసింది. ఢీ డాన్స్ ప్లాట్ ఫామ్ నుంచి టాలీవుడ్ కి చాలామంది స్టార్ కొరియోగ్రాఫర్స్ పుట్టుకొచ్చారు. ఇక తర్వాత గత కొన్ని సీజన్స్ గా మేల్ యాంకర్ ప్రదీప్ మాచిరాజు ఢీ డాన్స్ షోని సక్సెస్ ఫుల్ గా యాంకరింగ్ చేస్తున్నాడు. సుడిగాలి సుధీర్, రష్మిక, ఆది, షాలిని ఇలా కొంతమందిని మెంటర్స్ గా పెట్టి ప్రదీప్ మాచిరాజు చేసే కామెడీతో అటు డాన్స్ లతో పాటుగా ఇటు ఎంటర్టైన్మెంట్ తో ఢీ డాన్స్ షో క్రేజీగా మారింది.
చాలా సీజన్స్ నుంచి ప్రదీప్ మాచిరాజు యాంకర్ గా నడుసున్న ఢీ డాన్స్ షో ప్రస్తుతం సీజన్ 15 ని సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసుకుంది. ఇప్పుడు రాబోయే సీజన్ ని సెలెబ్రిటీ సీజన్ గా పిలవడమే కాదు.. ఈ సీజన్ కి యాంకర్ కూడా మారిపోయాడు. ప్రదీప్ మాచిరాజు స్థానంలో యాక్టర్ నందు కనిపిస్తున్నాడు. సినిమాల్లో కేరెక్టర్ ఆర్టిస్ట్ గా కొన్ని సినిమాల్ హీరోగా కనిపించిన ఆనంద్ కృష్ణ అలియాస్ నందు ఈ ఢీ సీజన్ 16 కి యాంకర్ గా రాబోతున్నట్లుగా తెలుస్తుంది.
వచ్చే సీజన్ సెలెబ్రిటీ సీజన్ అంటూ నందు చెబుతున్న ప్రోమోని రివీల్ చేసారు. మరి నిజంగానే ప్రదీప్ మాచిరాజు ఢీ షో నుంచి వెళ్లిపోయాడా.. కొత్తదనం కోసం నందుని మల్లెమాల యాజమాన్యం తీసుకొచ్చిందా అనేది వచ్చే బుధవారం కానీ క్లారిటీ రాదు.