Advertisement
Google Ads BL

పూజ హెగ్డేకి బెదిరింపులు: నిజమెంత?


టాలీవుడ్ లో ప్రస్తుతం హడావిడి లేని పేరు పూజ హెగ్డే. వరస ప్లాప్ లతో గుంటూరు కారం అవకాశం మిస్ చేసుకున్న పూజ హెగ్డే సౌత్ లో ఎలాంటి ప్రాజెక్టు కి సైన్ చెయ్యలేదు. బాలీవుడ్ మీదే ఆశలు పెట్టుకున్న ఈ భామకి అక్కడ అవకాశాలు వచ్చాయి అంటున్నారు.. కానీ పూజ హెగ్డే మాత్రం ప్రెజెంట్ ఎలాంటి షూటింగ్స్ కి హాజరవడం లేదు, బాలీవుడ్ ఈవెంట్స్ లో హడావిడి చేస్తున్న ఈభామపై ఇప్పుడొక రూమర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Advertisement
CJ Advs

పూజ హెగ్డే ఓ ఈవెంట్ లో పాల్గొనేందుకు దుబాయ్ వెళ్ళినప్పుడు అక్కడ పెద్ద గొడవ జరగడంతో.. కొంతమంది పూజ హెగ్డే ని చంపేస్తామని బెదిరించారంటూ బాలీవుడ్ మీడియాలో కథనాలు ప్రచారంలోకి వచ్చాయి. ఆ న్యూస్ చూసిన పూజ హెగ్డే అభిమానులు ఆందోళన పడుతున్నారు. అంతేకాకుండా సోషల్ మీడియాలో పూజ హెగ్డే అభిమానులు షాకవుతూ పెట్టిన పోస్ట్ లకి పూజ హెగ్డే టీమ్ రియాక్ట్ అయ్యింది. అసలు ఇలాంటి తప్పుడు వార్తలు ఎలా పుడుతున్నాయి, ఇలాంటి పుకార్లని నమ్మవద్దు అని చెప్పింది.

పూజ హెగ్డే ని బెదిరించారని వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు, ఇలాంటి వార్తలని నమ్మొద్దు అంటూ పూజ హెగ్డే టీమ్ క్లారిటీ ఇచ్చింది. 

Rumors About Death Threats To Pooja Hegde! :

Rumors About Death Threats To Pooja Hegde! – Not True
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs