తెలుగు లో వాల్తేర్ వీరయ్య-వీర సింహారెడ్డి చిత్రాలు తర్వాత శృతి హాసన్ జాడ లేదు. సౌత్ లో ఆమెకి సలార్ ప్యాన్ ఇండియా ఫిలిం తప్ప మరో మూవీలేదు. ఈలోపులో ఆమె గెస్ట్ రోల్ చేసిన హాయ్ నాన్న విడుదలైంది. అందులో శృతి హాసన్ ఉన్న విషయం కూడా మరిచిపోయారు. ఇక ఇప్పుడు అడివి శేష్ తో మరో ప్యాన్ ఇండియా ఫిల్మ్ కి సైన్ చేసిన శృతి హాసన్ సోషల్ మీడియాలో స్పెషల్ ఫోటో షూట్స్ తో అదరగొట్టేస్తుంది. అయితే తాజాగా ఈ భామకి మరో బిగ్గెట్స్ ఛాన్స్ వచినట్టుగా తెలుస్తుంది.
అది యశ్ తో కలిసి శృతి హాసన్ నటించబోతుంది అనే న్యూస్ సోషల్ మీడియాలో వినిపిస్తోంది. KGF తర్వాత లాంగ్ బ్రేక్ తీసుకున్న యశ్ జీతూ మోహన్ దాస్ తో Yash19 అంటే ట్యాక్సీ మూవీని ఈమధ్యనే ప్రకటించారు. ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో ప్యాన్ ఇండియా స్టయిల్లో నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో యశ్ కి జోడిగా సాయి పల్లవి నటించనుంది అనే న్యూస్ తో పాటుగా ఇప్పుడు శృతి హాసన్ కూడా జాయిన్ అవ్వబోతుంది అనే న్యూస్ ప్రచారంలోకి వచ్చింది.
మరి యశ్ 19 లో ముగ్గురు హీరోయిన్స్ కి చోటుంది అంటున్నారు. అందులో ఒకరు సాయి పల్లవి, మరొకరు శృతి హాసన్ ఫైనల్ అయ్యింది అనే మాట వినిపిస్తోంది. చూద్దాం శృతి హాసన్ యశ్ తో జోడి కడుతుందో, లేదో అనేది.