Advertisement
Google Ads BL

గుంటూరు కారం మసాలా సరిపోవట్లేదు


గుంటూరు కారం లో మసాలా సరిపోవట్లేదు ఇది మనం అంటున్న మాట కాదు.. మహేష్ అభిమానులే మాట్లాడుకుంటున్నారు. గుంటూరు కారం అప్ డేట్స్ కోసం ఎదురు చూసి అవి రాగానే క్షణాల్లో వైరల్ చేస్తున్న అభిమానులని ఆ అప్ డేట్స్ పై వస్తున్న సోషల్ మీడియా కామెంట్స్ మాత్రం డిస్పాయింట్ చేస్తున్నాయి. ఇంతకుముందు దమ్ మసాలా సాంగ్ లో దమ్ము లేదన్నారు. నిన్న బుధవారం విడుదలైన ఓ మై బేబీ సాంగ్ కూడా అభిమానులని, మూవీ లవర్స్ ని అంతగా ఇంప్రెస్స్ చెయ్యలేకపోయింది అనేది సోషల్ మీడియా ఓపెన్ చేస్తే అర్ధమవుతుంది.

Advertisement
CJ Advs

రామజోగయ్య శాస్త్రి ఇంగ్లీష్, తెలుగు కలగలసిన పదాలతో ఓ మై బేబీ పాటని నింపేయగా, ఎక్కువ హోరు జోరు లేకుండా కూల్ గా సాగింది. కానీ ఇది ఫాన్స్ కి సరిపోయే పాట కాదు, గుంటూరు కారం ఆల్బమ్ లో నిలిచిపోయేది కాదు. త్రివిక్రమ్-థమన్ మ్యూజిక్ కాంబోపై అంచనాలు, మహేష్-త్రివిక్రమ్ కాంబోపై ఉన్న అంచనాలు అందుకోవడం ఈ రెండు సాంగ్స్ విఫలమయ్యాయి. అందుకే గుంటూరు కారం లో ఘాటు, మసాలా చాల్లేదు అంటున్నారు.

శ్రీలీలతో మహేష్ స్క్రీన్ కెమిస్ట్రీ ఎలా ఉంటుందో అని ఆ పాట ని ఓపెన్ చేస్తే.. డ్రాయింగ్స్ తో, మధ్యలో మేకింగ్ విజువల్స్ తో సరిపెట్టారు కానీ.. మహేష్-శ్రీలీల మధ్యలో కెమిస్ట్రీ చూపించలేదనే డిస్పాయింట్మెంట్ వారిని బాగా వెంటాడుతుంది. మరి బేబీ సాంగ్ ఇంత చప్పగా ఎలాంటి ఫీలింగ్ లేకుండా చేసేసింది.. అదే మహేష్ ఫాన్స్ ని బాగా ఇబ్బంది పెడుతుంది. మరి గుంటూరు కారం నుంచి రాబోయే పాటలెలా ఉంటాయో చూడాలి. 

Guntur Kaaram 2nd Oh My Baby Released:

Guntur Kaaram Second Single Oh My Baby Released
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs