Advertisement
Google Ads BL

ఇలాంటి అప్ డేట్స్ ఇస్తే నీరసం వచ్చేస్తుంది


నిన్నటివరకు సలార్ అప్ డేట్స్ కోసం సోషల్ మీడియాలో రకరకాల మీమ్స్, రకకరాల న్యూస్ లు నడిచాయి. సినిమా విడుదలకి వారం కూడా టైమ్ లేదు కానీ మేకర్స్ అంత గప్ చుప్ గా ఉన్నారేమిటా అని తలొకరూ తలొక ట్వీట్ వేశారు. సరే ట్రైలర్ ఇచ్చారు, బిజినెస్ లో ఊపొస్తుంది అనుకుంటే అది ఫెయిల్ అయ్యింది. ఇక ఫస్ట్ సింగిల్ వదిలారు. అది మరింత చప్పగా ఉందనే విమర్శలు స్టార్ట్ అయ్యాయి. సినిమాపై అంచనాలు పెంచాలి కానీ.. ఇలాంటి అప్ డేట్స్ వస్తే నీరసం వస్తుంది అనే మాట వినిపిస్తోంది.

Advertisement
CJ Advs

మరోపక్క సలార్ మూవీలో ప్రభాస్ ఎంట్రీ చాలా లేట్ గా అంటే దాదాపుగా 40 నిమిషాల తర్వాత ఉంటుంది అనే న్యూస్ తో పాటుగా.. ట్రైలర్, సాంగ్ ఇలా ఏది చూసినా విలన్ పాత్రధారి పృథ్వీ రాజ్ సుకుమారన్ హైలెట్ అవ్వడం, ఇక సలార్ అప్ డేట్స్ లో ఒక్కటి కూడా హీరోయిజమ్ హైలెట్ అయ్యే షాట్ లేదు, ప్రభాస్ కటౌట్ కి సరిపోయే సీన్ లేదు. ఇలా సలార్ పై రోజు రోజుకి నెగిటివిటీ ఎక్కువైపోతోంది. మరి బజ్ పెంచాల్సిన అప్ డేట్స్ ఇలా నీరసం తెప్పిస్తే ఎలా.

నిన్న విడుదలైన పాట ప్రేక్షకులని కాదు అభిమానులని కూడా ఇంప్రెస్స్ చెయ్యలేకపోయింది. మరి ఇప్పటివరకు సలార్ టీమ్ లో కదలిక లేదు, సినిమా ప్రమోషన్స్ లో ప్రభాస్ పాల్గొంటాడు అనేదానిలో క్లారిటీ లేదు. ఉన్నది ఉన్నట్లుగా చెబుతుంటే ప్రభాస్ ఫాన్స్ కి కోపం వచ్చేస్తుంది. కావాలని నెగిటివి స్ప్రెడ్ చేస్తున్నారు అంటున్నారు. మరి ప్రేక్షకులు మాట్లాడుకుంటున్న వాటిలో నిజాలు లేకపోలేదు.

If you give such updates, you will get bored:

Salaar first single released 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs