బిగ్ బాస్ సీజన్ 6 లో మిడ్ వీక్ ఎలిమినేషన్ అంటూ సిరిని సడన్ గా ఎలిమినేట్ చేసి కొద్దిగంటలు సీక్రెట్ రూమ్ లో ఉంచి మళ్ళీ హౌస్ లోకి తీసుకొచ్చేసారు. అలా సిరిని టాప్ 5 లోకి తీసుకెళ్లారు. ఇక ఈ సీజన్ లో టాప్ 5 కాకుండా టాప్ 6 అంటూ నాగార్జున గత ఆదివారమే ప్రకటించేసారు. అర్జున్ అంబటి, పల్లవి ప్రశాంత్, యావర్, శివాజీ, ప్రియాంక, అమర్ దీప్ లు టాప్ 6 లో ఉన్నారు. అయితే ఎప్పుడూ టాప్ 5 కంటెస్టెంట్స్ ఉండే బిగ్ బాస్ లో ఇప్పుడు టాప్ 6 కనిపిస్తున్నారు.
వచ్చే గ్రాండ్ ఫినాలే నాటికి టాప్ 5 మాత్రమే ఉంటారు.. అంటే ఒకరు మిడిల్ వీక్ లో ఎలిమినేట్ అవుతారు.. అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం హౌస్ లో టాప్ 6 కంటెస్టెంట్స్ హౌస్ జర్నీలు చూపిస్తున్నారు. అమర్ దీప్, అర్జున్ అంబటి, శివాజీ, ప్రియాంకల జర్నీలు పూర్తి కాగా.. ఈరోజు యావర్, పల్లవి ప్రశాంత్ ల జర్నీలు చూపించారు. జర్నీలు చూసి కంటెస్టెంట్స్ అందరూ ఎమోషనల్ అయ్యారు. ఈ వీక్ మిడిల్ లో ఎవరు ఎలిమినేట్ అవుతారో అనేది ఇంట్రెస్టింగ్ గా మారింది.
ఫినాలే వీక్ ఓటింగ్ లో టాప్ 1 లో పల్లవి ప్రశాంత్ ఉండగా రెండోస్థానంలో శివాజీ ఉన్నాడు. ఇక మూడో స్థానంలో అమర్ దీప్, నాలుగో స్థానంలో యావర్, ఆ తర్వాత స్థానాల్లో ప్రియాంక, అంబటి అర్జున్ లు ఉండగా.. టాప్ 5 లో ఇప్పటికే అంబటి అర్జున్ బెర్త్ ఖాయం చేసుకున్నాడు. మరి ఈ ఈవారం మిడిల్ వీక్ లో వెళ్లాల్సి వస్తే యావర్ కాని, ప్రియాంక కానీ వెళ్లే అవకాశం ఉంది అంటున్నారు, అమ్మాయిని ఉంచాలంటే యావర్ కి ఎలిమినేషన్ తప్పేలా లేదు.