అసెంబ్లీ ఓకే.. మండలి పరిస్థితేంటి?


తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని దక్కించుకుంది. అసెంబ్లీ సంగతి ఓకే.. రానున్న పార్లమెంటు ఎన్నికల్లో దాని వ్యూహాలు దానికి ఉంటాయి కానీ అసలు చిక్కల్లా తెలంగాణ శాసనమండలితోనే. ఇక్కడ సంఖ్యా బలం కాంగ్రెస్ పార్టీకి చాలా తక్కువ. మండలిలో మొత్తం సభ్యుల సంఖ్య 40 అయితే బీఆర్ఎస్‌కు 28 మంది.. అందులో కాంగ్రెస్ ఉన్నది ఒకే ఒక్క సీటు.. గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో గెలిచిన జీవన్ రెడ్డి మాత్రమే కాంగ్రెస్‌కు ఉన్నారు. పోనీలే ఏముంది? ఎలాగోలా ఫిల్ చేసుకుందాములే అనుకుంటే 2025 వరకూ ఖాళీ అయ్యే ఎమ్మెల్సీ సీట్లే లేవు. దీంతో అప్పటి వరకూ మండలిలో కాంగ్రెస్‌కు పట్టు అనేది అసాధ్యం. ఏమైనా కీలక బిల్లులను కాంగ్రెస్ ప్రవేశ పెట్టిందా? ప్రభుత్వానికి ఇక్కట్లు తప్పవు. ఆ బిల్ పాస్ కావడం కష్టమే.

మరో స్టెప్ ఏదైనా తీసుకుంటారా?

కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పట్లో అయితే మండలిలో సపోర్ట్ లేనిదే అనుకున్నది చేయడం కష్టం. ఇక ఇప్పుడు అధికార పార్టీ ఏం చేయనుందనేది ఆసక్తికరంగా మారింది. ఈ పరిస్థితిని సీఎం రేవంత్ రెడ్డి ఎలా అధిగమిస్తారనేది హాట్ టాపిక్‌గా మారింది.  బిల్లులు ఏవైనా సరే.. తమకు బలం వచ్చే వరకూ వెయిట్ చేస్తుందా? లేదంటే.. ప్రవేశ పెట్టి ప్రతిపక్షాల వల్లే అది సాధ్యం కాలేదని చెబుతుందా? లేదంటే మరో స్టెప్ ఏదైనా తీసుకుంటారా? అనే విషయాలపై చర్చ జరుగుతోంది. మరో స్టెప్ ఆపరేషన్ ఆకర్ష్. బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు ఎర వేసి పార్టీలోకి లాగేయడం. నిజానికి అధికార పార్టీ ఏదైనా ముందుగా చేసే పని ఇదే. ఇప్పటికిప్పుడు అయితే మండలిలో ఆరు ఖాళీలు ఉన్నాయి.

ఎమ్మెల్యేల బలం ఉంది..

గవర్నర్ కోటాకు చెందినవి రెండు కాగా.. ఎమ్మెల్యేలుగా విజయం సాధించిన నలుగురు ఎమ్మెల్సీలు రాజీనామా చేశారు. మొత్తం ఆరు ఖాళీల్లో రెండు అయితే కాంగ్రెస్ ఖాతాలోకి వెళ్లడం ఖాయం. ఎందుకంటే.. కడియం శ్రీహరి, కౌశిక్ రెడ్డి ఇద్దరూ ఎమ్మెల్యే కోటా నుంచి ఎన్నకైన వారు కాబట్టి.. ఇప్పడు కాంగ్రెస్‌కు ఎమ్మెల్యేల బలం ఉంది. దీంతో పక్కాగా ఆ రెండూ కాంగ్రెస్‌వే. ఇక మరో ఇద్దరిలో ఒకరు పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఇంకొకరు స్థానిక సంస్థల నియోజకవర్గం నుంచి గెలిచారు. ఆ ఇద్దరూ ప్రస్తుతం రాజీనామా చేశారు. పోనీ ఇవన్నీ కాంగ్రెస్ ఖాతాలో పడినా కూడా సంఖ్యా బలం పెద్దగా ఏమీ పెరగదు. బీఆర్ఎస్‌ను బీట్ చేయడం జరగదు. ఈ సమయంలో కాంగ్రెస్ పార్టీ ఎలా వ్యవహరిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. 

Assembly ok.. What about council?:

Assembly vs Mandali 
Show comments


LATEST TELUGU NEWS


LATEST IN NEWS

POPULAR NEWS



LATEST IN GALLERIES

POPULAR GALLERIES