ఎన్టీఆర్ ఫాన్స్ ఆనందంగా ఉండాల్సిన సమయమిది. ఆర్.ఆర్.ఆర్ తర్వాత దేవర లాంటి బిగ్గెస్ట్ ప్యాన్ ఇండియా మూవీతో ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు ఎన్టీఆర్ తెగ కష్టపడుతున్నాడు. దేవర అప్ డేట్స్ తో ఎన్టీఆర్ ఫాన్స్ ఎప్పటికప్పుడు సర్ ప్రైజ్ అవుతూనే ఉన్నారు. మరి ఆనందంగా ఉండాల్సిన సమయంలో వారి కంట కన్నీళ్లు రావడానికి కారణమిటంటే కళ్యాణ్ రామ్. కళ్యాణ్ రామ్ తమ్ముడు తారక్ పై చూపిస్తున్న ప్రేమ చూసి తారక్ అభిమానుల కళ్ళల్లో లైట్ గా కన్నీళ్లు వస్తున్నాయట.
గత రాత్రి కళ్యాణ్ రామ్ డెవిల్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో పాల్గొన్నారు. అదే ఈవెంట్ లో తారక్ దేవర గురించి అప్ డేట్ ఇచ్చారు ఆయన. దేవర మూవీకి కళ్యాణ్ రామ్ వన్ అఫ్ ద ప్రొడ్యూసర్. అయితే కళ్యాణ్ రామ్ తమ్ముడు అలాగే ఆయన సినిమా దేవర గురించి మాట్లాడిన వీడియో చూసిన తారక్ ఫాన్స్ సోషల్ మీడియా వేదికగా.. Lyt గా కళ్ళలో నీళ్లు వచ్చాయ్ @NANDAMURIKALYAN 🥺😍 అన్నా, అస్సలు నువ్వు మీ తమ్ముడు కి సపోర్ట్ గా లేకపోయుంటే ఊహించుకోడానికి కూడా భయంగా అనిపించింది.. అంటూ చేసిన ట్వీట్ వైరల్ గా మారింది.
ఎన్టీఆర్ ని నందమూరి కుటుంబం పక్కనబెట్టినా హరికృష్ణ మరణం తర్వాత కళ్యాణ్ రామ్ తమ్ముడిని తండ్రిలా చూసుకుంటున్నాడు. అప్పటి నుంచి నందమూరి ఫ్యామిలీ కన్నా తమ్ముడే తనకి ఎక్కువ అన్నట్టుగా కళ్యాణ్ రామ్ ప్రవర్తన ఉంది. తమ్ముడిని అభిమానించడం, ఫ్యామిలీ తనని పక్కనబెడుతుంది అని తెలిసినా ఎన్టీఆర్ కి సపోర్ట్ చేయడం ఇవన్నీ కళ్యాణ్ రామ్ పై ఎన్టీఆర్ ఫాన్స్ లో అభిమానం పెరగడానికి కారణమయ్యాయి.