నిన్నమొన్నటివరకు సలార్ సౌండ్ లేదు, బజ్ పోతుంది, KGF అప్పుడు మేకర్స్ అంత హడావిడి చేసారు, సలార్ టైమ్ వచ్చేసరికి మేకర్స్ సైలెంట్ అయ్యారు, విడుదలకు సమయం లేదు, అయినా ప్రమోషన్స్ జోరు లేదు అన్నారు, అనుకున్నారు. అనుకోవడం కాదు.. విడుదలకు పట్టుమని పది రోజులు కూడా లేదు.. సలార్ ప్రమోషన్స్ స్టార్ట్ కాలేదు, దానితో ప్రభాస్ అభిమానులు కంగారు, ఆందోళన పడిపోతున్నారు. సోషల్ మీడియాలో సలార్ కి బజ్ లేదు అనడం చూసి వారిలో మరింత బాధ.
కానీ ఇప్పడూ సలార్ సౌండ్ గట్టిగా మొదలైంది. రేపు సలార్ నుంచి ఫస్ట్ సింగిల్ వస్తున్నట్టుగా ఈరోజు మంగళవారం మేకర్స్ ప్రకటించారు. దాంతో ఒక్కసారిగా సలార్ హడవిడి సోషల్ మీడియాలో కనిపించింది. మరోపక్క సలార్ విడుదలయ్యాక రోజుకి ఆరు షోస్ వేసుకునేందుకు పర్మిషన్స్ కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి అంటూ మరో న్యూస్ కనిపించింది.
అంతేకాకుండా సలార్ తెలుగు హక్కులని మైత్రి మూవీస్ వారు రికార్డు రేట్ కి కొన్నారు, కాబట్టి వారు ప్రస్తుతం బిజినెస్ లో బిజీ ఉన్నారు.. సలార్ నుంచి సెన్సషనల్ ఓపెనింగ్స్ రాబట్టాలని గట్టిగా ప్రయత్నిస్తున్నారు అంటూ మరో వార్త.. ఇలా సోషల్ మీడియాలో మొత్తం సలార్ హడావిడి కనిపించేసరికి ప్రభాస్ ఫ్యాన్స్ సలార్ పై నెగిటివిటీ చూపిస్తున్న వారికి ఈ సౌండ్ సరిపోతుందా అంటూ కౌంటర్ ఎటాక్ చేస్తున్నారు.