2024 లు ఎన్నికల్లో జనసేన పార్టీ ఎంతోకొంత ప్రభావితం చూపుతుంది అని టీడీపీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు జనసేనతో కలిసిపోయారు. అప్పుడు మోడీ ప్రభుత్వంపై చంద్రబాబు పెట్టుకున్న నమ్మకంతో జనసేన-టీడీపీ-బీజేపీ లు కలిసి పోటీ చెయ్యగా.. ఆ రెండూ పార్టీలు టీడీపీకి అధికారాన్ని కట్టబెట్టాయి. ఆ తర్వాత 2019 లో జనసేన, బీజేపీ, టీడీపీ ఎవరికివారే యమునా తీరే అన్నట్టుగా పోటీ చేసి ఓడిపోయాయి. అక్కడ మూడు పార్టీలు కొట్టుకోవడంతో వైసీపీ లాభపడింది. ఇక ఈ ఎన్నికల్లో ఎలాగైనా టీడీపీతో దోస్తీ కట్టి వైసీపీని మట్టికరిపించాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫిక్స్ అయ్యారు.
చంద్రబాబు జైల్లో ఉన్న సమయంలో పవన్ కళ్యాణ్ జనసేన-టీడీపీ కలిపి పోటీ చేస్తాయని ప్రకటించారు. ఆ తర్వాత చంద్రాబాబు పవన్ కళ్యాణ్ సహాయాన్ని మరువలేను అని థాంక్స్ చెప్పారు. జనసేన-టీడీపీ సమన్వయ కమిటీ భేటీలో పవన్-లోకేష్ కలిసి కనిపించారు. అయితే వచ్చే ఎన్నికల్లో పొత్తు ప్రకటించాక జనసేనకు ఎన్ని సీట్లు కేటాయించాలనే విషయంలో చంద్రబాబు ఇంకా ఏ అంచనాకి రాలేదు. అటు జనసేన కూడా చంద్రబాబుని డిమాండ్ చెయ్యలేని పరిస్థితి.
ఇటు చూస్తే తెలంగాణ ఎన్నికల్లో జనసేన పోటీ చేసి ఘోరంగా ఓడిపోయింది. ఆ ప్రభావం ఏపీలో ఎంతో కొంత ఉంటుంది. అందుకేనేమో పవన్ కళ్యాణ్ పై చంద్రబాబు కి నమ్మకం తగ్గి ఉండొచ్చు. అందుకే జనసేన పొత్తు విషయంలో బాబు గారు అంత లైట్ గా ఉన్నారంటూ సోషల్ మీడియాలో ప్రచారం స్టార్ట్ అయ్యింది. పొత్తు ప్రకటించినప్పుడు ఉన్న ఊపు ఎన్నికల దగ్గరపడే కొద్దీ తగ్గిపోతుంది, పవన్ కళ్యాణ్ తో పొత్తు పెట్టుకుని కొన్ని సీట్స్ పోగట్టుకోవడం అవసరమా అనే ఆలోచనలోను టీడీపీ ఉంది అంటున్నారు.
మరి వచ్చే ఏడాది ప్రథమార్ధంలో జరగబోయే ఎన్నికల్లో జనసేన-టీడీపీ కలిసి పోటీ చేస్తే జనసేనకు ఎన్ని సీట్లు ఇస్తారో త్వరగా ప్రకటిస్తే ఇలాంటి గాసిప్స్ కి అడ్డుకట్ట వెయ్యొచ్చు. లేదంటే.. ఇలాంటివే వినాల్సి వస్తుంది.