బాలీవుడ్ లో బుల్లితెర మీద ఫేమస్ అయ్యి ఆ తర్వాత హీరోయిన్ గా టర్న్ అయ్యి సీతారామంతో సౌత్ ఇండియా ప్రేక్షకులకి దగ్గరైన మృణాల్ ఠాకూర్ ని సీతగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, కన్నడ భాషల ప్రేక్షకులు గుండెల్లో నింపేసుకున్నారు. సీతారామం తర్వాత మృణాల్ ఠాకూర్ కి తెలుగులో భారీ ఆఫర్స్ వచ్చాయని చెప్పుకున్నారు కానీ.. ఆమె మాత్రం నాని హాయ్ నాన్న కి, విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ కి మాత్రమే సైన్ చేసింది. ఆమెకి అవకాశాలొచ్చినా ఒప్పుకోలేదో.. లేదంటే రాలేదో కానీ.. ఆమె మాత్రం ఆచి తూచి అడుగులు వేసినట్టుగా కనిపించింది.
అందులో మొదటగా హాయ్ నాన్న ఆమెకి సక్సెస్ ఇచ్చింది. హాయ్ నాన్న సూపర్ బ్లాక్ బస్టర్ హిట్ కాకపోయినా.. సినిమాని ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ఇందులో మృణాల్ ఠాకూర్ లుక్స్, ఆమె పెరఫార్మెన్స్ బావున్నాయనే మాట కూడా వినిపిస్తుంది. అయితే వచ్చిన అవకాశమల్లా ఒప్పేసుకోకుండా ఇలా కథా బలం, తన పాత్రకి ప్రాధాన్యత ఉన్న సినిమాలని ఒప్పుకుని మృణాల్ సక్సెస్ కొట్టింది.
కానీ శ్రీలీల అనుభవ రాహిత్యంతో వచ్చిన సినిమాలన్నీ ఒప్పుకుని వరసగా ఫెయిల్యూర్స్ చవి చూస్తుంది. యంగ్ హీరోల అవకాశాలొచ్చేశాయి కదా అని అని ఎడా, పెడా సైన్ చేసింది. దాని ఫలితం నెలకో ప్లాప్ శ్రీలీల ని తగులుకుంది. మరి ప్లానింగ్ లేకుండా సినిమాలు చేస్తే ఇలానే దెబ్బైపోవాలి, మృణాల్ చూసి నేర్చుకుంటే శ్రీలీల కి బావుంటుంది అనే కామెంట్స్ నెటిజెన్స్ నుంచి వినిపిస్తున్నాయి.