Advertisement
Google Ads BL

కేసీఆర్‌కు సెలెబ్రిటీస్ పరామర్శ


తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ తొంటికి శస్త్రచికిత్స చేయించుకుని యశోద ఆసుపత్రిలో వైద్యుల పర్యవేక్షణలో ఉన్న విషయం తెలిసిందే. కేసీఆర్ ని నిన్న ఆదివారం తెలంగాణ ముఖ్యంమత్రి రేవంత్ రెడ్డి యశోద ఆస్పత్రికి వెళ్లి పరామర్శించారు. ఆయన వెంట కొంతమంది మంత్రులు కూడా వెళ్లారు. ఇక ఈ రోజు కేసీఆర్ ని చూసేందుకు పరామర్శించేందుకు పోటెత్తారు. కేసీఆర్ వీలైనంత త్వరగా కోలుకొని ప్రజా సేవకు రావాలని టీడీపీ అధినేత చంద్రబాబు ఆకాంక్షించారు. సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన్ను చంద్రబాబు పరామర్శించారు. 

Advertisement
CJ Advs

కేసీఆర్‌ ఆరోగ్య పరిస్థితి గురించి అక్కడి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రి వెలుపల చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ.. ఆయనతో మాట్లాడాలనిపించి వచ్చాను. కోలుకోవడానికి ఆరువారాల సమయం పడుతుందని వైద్యులు చెప్పారు. వైద్యులు చాలా చక్కగా ఆపరేషన్‌ చేశారు. త్వరలోనే కేసీఆర్‌ మామూలుగా నడుస్తారని చంద్రబాబు అన్నారు. 

చంద్రబాబు మాత్రమే కాదు కేసీఆర్‌ను పలువురు నేతలు పరామర్శిస్తున్నారు. తెలంగాణ ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క.. కేసీఆర్‌ను కలిసి మాట్లాడారు. ప్రముఖ సినీనటుడు ప్రకాశ్‌రాజ్‌, బీఎస్పీ నేత ఆర్‌.ఎస్‌. ప్రవీణ్‌కుమార్‌ కూడా కేసీఆర్‌ను పరామర్శించి, క్షేమ సమాచారం తెలుసుకున్నారు. ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి యశోద ఆసుపత్రికి వచ్చారు. చిరు కేటీఆర్, కవితలతో మాట్లాడి కేసీఆర్ నిపరామర్శించి వచ్చిన వీడియోస్, ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. 

Politicians, celebrities call on ex-CM KCR:

Politicians, Celebrities Visit Former CM KCR at Hospital
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs