సైంధవ్ టీమ్ విజయవాడలో సందడి చేస్తుంది. హీరో వెంకటేష్, దర్శకుడు శైలేష్ కొలనులు విజయవాడలో సైంధవ్ ప్రమోషన్స్ కోసం ఈ రోజు ఉదయమే విజయవాడ చేరుకున్నారు. విజయవాడలో ఫేమస్ అయిన బాబాయ్ హోటల్ లో విక్టరీ వెంకటేష్ బ్రేక్ ఫాస్ట్ చేసారు. బాబాయ్ హోటల్ లో ఇడ్లి తింటూ ఎంజాయ్ చేసిన వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
అక్కడ హోటల్ లో అందరితో మాట్లాడుతూ కౌంటర్ దగ్గరకి వెళ్లి ఇడ్లి ఆర్డర్ ఇచ్చి అక్కడే ఉన్న ఓ టేబుల్ దగ్గరకి వెళ్లారు. ఆ టేబుల్ దగ్గర టిఫిన్ చేస్తున్న వారితో మట్లాడుతూ సరదాగా ఇడ్లి తిన్న వెంకీ ని చూసి అందరూ ముచ్చటపడిపోయారు. ఆ తర్వాత వెంకీ దర్శకుడు శైలేష్, ఇంకా చిత్ర బృందం కనకదుర్గ గుడిలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. వెంకటేష్-శైలేష్ కొలను సైంధవ్ సంక్రాంతికి విడుదల కాబోతుంది. ప్రస్తుతం ప్రమోషనల్ కార్యక్రమాల్లో చిత్ర బృందం బిజీగా వుంది.