Advertisement
Google Ads BL

లోకేష్ బావ కోసం కదిలిన మోక్షజ్ఞ


నందమూరి బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ ఎప్పుడెప్పుడు హీరోగా ఎంట్రీ ఇస్తాడా అని నందమూరి అభిమానులు ఎదురు చూస్తున్నారు. కానీ మోక్షజ్ఞ ఎంట్రీ మీద బాలయ్య ఇప్పటివరకు క్లారిటీ ఇవ్వడం లేదు. అయితే మోక్షజ్ఞ ఈ మధ్యన హీరో మెటీరియల్ లా తయారయ్యాడు. ఇంతకుముందు ముద్దుగా బొద్దుగా కనిపించిన మోక్షజ్ఞ ఇప్పుడు హ్యాండ్ సమ్ గా స్లిమ్ లుక్ లో కనిపిస్తున్నాడు. అందుకే మోక్షజ్ఞ ఎంట్రీ పై అభిమానుల్లో మరింత ఉత్సుకత పెరిగిపోతుంది.

Advertisement
CJ Advs

అయితే తాజాగా మోక్షజ్ఞ సినిమాల్లోకి ఎంట్రీ ఏమోకానీ.. రాజకీయాల్లకి ఎంట్రీ ఇచ్చాడా అనిపించేలా తన అక్క భర్త బావ లోకేష్ యువగళం కోసం కదిలాడు. యువగళం పాదయాత్రలో బావతో పాటుగా కాలు కదిపాడు. యువగళం పాదయాత్రలో బాలకృష్ణ చిన్నల్లుడు భరత్‌, మోక్షజ్ఞ తో పాటుగా పెద్ద ఎత్తున టీడీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. జనవరి 27న కుప్పంలో ప్రారంభమైన యువగళం పాదయాత్ర పది ఉమ్మడి జిల్లాల్లో 92 నియోజకవర్గాల మీదుగా సాగిన ఈ యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని మలికిపురం మండలం దిండి వద్ద సెప్టెంబరు 8న యాత్ర ప్రవేశించింది. ఆతర్వాత రోజు చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో పాదయాత్ర 79 రోజులపాటు ఆగింది. గత నెల 26న యాత్ర పునఃప్రారంభించారు. 

ఈ యువగళం పాదయాత్రలో బాలయ్య వారసుడు మోక్షజ్ఞని చూడగానే అభిమానులు, టీడీపీ కార్యకర్తలు మరింత ఉత్సాహంతో అడుగులు వేశారు. అక్క బ్రాహ్మణి, చిన్న బావ భరత్, మేనల్లుడు దేవాన్ష్, పెద్ద బావ లోకేష్ లతో మోక్షజ్ఞ దిగిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Mokshagna Teja Visuals At Yuvagalam Padayatra:

Balakrishna Son Mokshagna Teja At Yuvagalam Padayatra
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs