Advertisement
Google Ads BL

ఎన్టీఆర్ దేవర పై క్రేజీ న్యూస్


యంగ్ టైగర్ ఎన్టీఆర్-కొరటాల శివ కలయికలో క్రేజీ ప్యాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న దేవర మూవీ షూటింగ్ చక చకా చిత్రీకరణ జరిగిపోతుంది. హెవీ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ మూవీ ఏప్రిల్ 5 న విడుదల అంటూ, అది కూడా దేవర పార్ట్1 గా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే ఇప్పుడు దేవర చిత్రంపై ఓ క్రేజీ న్యూస్ బయటికొచ్చింది. ఈ సినిమాలో ఎన్టీఆర్ పై ఓ ఫ్లాష్ బ్యాక్ ఉంటుందట. 

Advertisement
CJ Advs

దేవర గానే మాస్ లుక్ లో కనిపిస్తున్న ఎన్టీఆర్ ఫ్లాష్ బ్యాక్ లో పూర్తిగా రఫ్ అండ్ రగ్గుడ్ లుక్ లో కనిపిస్తాడని, సముద్రం మధ్యలో ఉండే ఓ దీవి నేపథ్యంలో వచ్చే ఈ ఫ్లాష్ బ్యాక్ భారీ యాక్షన్ తో ఉండబోతుంది అని తెలుస్తోంది. దేవర పార్ట్ 2 ఆల్మోస్ట్ ఈ దీవి నేపథ్యంలోనే నడుస్తోందని తెలుస్తోంది. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈచిత్రంలో సైఫ్ అలీ ఖాన్ పవర్ ఫుల్ విలన్ గా కనిపిస్తున్నారు.

అంతేకాకుండా పలు భాషలకి చెందిన నటులు ఈ దేవర చిత్రంలో భాగం చేస్తున్నారు కొరటాల. ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో కూడా ఏప్రిల్ 5 నే రిలీజ్ చేసేందుకు చిత్రబృందం ప్లాన్ చేస్తోంది.

Crazy news on NTR Devara:

NTR Devara update 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs