Advertisement
Google Ads BL

కేటీఆర్‌ను శ్రీధర్ బాబు మ్యాచ్ చేస్తారా?


తెలంగాణలో కాంత్రెస్ ప్రభుత్వం కొలువుదీరింది. సీఎంగా రేవంత్ రెడ్డి అధికారం చేపట్టారు. పలువురు మంత్రులు, ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం కూడా నిన్న ముగిసింది. ఇక తెలంగాణలో ఏ పార్టీ గెలుస్తుందని ఎన్నికలకు ముందు ఎంత హాట్ టాపిక్ నడిచిందో.. ఆ విధంగానే ఐటీ శాఖ విషయంలోనూ అంతే హాట్ టాపిక్ నడిచింది. గత ప్రభుత్వ హయాంలో మంత్రి కేటీఆర్ ఐటీ మంత్రిగా తన బాధ్యతలు అద్భుతంగా నిర్వర్తించారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఐటీ మినిస్టర్‌గా ఎవరు బాధ్యతలు నిర్వర్తిస్తారు? అనే విషయమై అయితే సస్పెన్స్ వీడిపోయింది. ఐటీ మంత్రిగా దుద్దిళ్ల శ్రీధర్‌బాబు బాధ్యతలు చేపట్టారు.

Advertisement
CJ Advs

ఆ స్థాయిలో పని చేయగలరా?

ఇక ఇప్పుడు చర్చనీయాంశంగా మారిన విషయం ఏంటంటే.. కేటీఆర్‌ను శ్రీధర్ బాబు మ్యాచ్ చేయగలరా? అనేది. గత ప్రభుత్వ హయాంలో టాప్ 2 ప్లేస్‌లో ఉండేవారు. ఐటీ శాఖ మంత్రిగా కూడా ఆయనది భారీ రోలే. మరి శ్రీధర్ బాబు ఆ స్థాయిలో పని చేయగలరా? అనేది సందేహం సర్వత్రా నెలకొంది. కేటీఆర్ వచ్చేసి సైన్స్ స్టూడెంట్. పూణె యూనివర్సిటీలో ఎంఎస్సీ బయోటెక్నాలజీ, యూనివర్సిటీ ఆఫ్ న్యూయార్స్ లోని బరూచ్ కాలేజ్ నుంచి మార్కెటింగ్ లో ఎంబీఏ చేశారు. పలు ఇంటర్వ్యూలను ఫేస్ చేశారు. ఒక కంపెనీకి సీఈఓగా విధులు నిర్వహించారు. ఇక ఆ తరువాత తెలంగాణ రాష్ట్రం రావడం.. బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించడం.. ఐటీ మంత్రిగా కేటీఆర్ బాధ్యతలు నిర్వహించడం చకచకా జరిగిపోయాయి. 

రేవంత్ నిర్ణయం సరైనదే..!

నిజానికి దుద్దిళ్ల శ్రీధర్ బాబు.. తండ్రి శ్రీపాదరావు వారసత్వాన్ని అందిపుచ్చుకుని రాజకీయాల్లోకి వచ్చారు. అంతకు ముందు ఢిల్లీ యూనివర్సిటీలో న్యాయవాద విద్యను అభ్యసించారు. ఇక ఆ తరువాత రాజకీయ ఆరంగేట్రం చేశారు. తండ్రికి తగ్గ తనయుడిగా.. మంచి స్పోక్స్ పర్సన్‌గానూ.. సౌమ్యుడిగానూ పేరు తెచ్చుకున్నారు. ఆ తరువాత వివిధ శాఖల మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆయన చేపట్టిన ఏ శాఖను అయినా పకడ్బంధీగా బాధ్యతలు నిర్వర్తించారు. ఇప్పుడు ఐటీ శాఖకు కూడా కేటీఆర్ మాదిరిగానే న్యాయం చేయగలరని అందరూ విశ్వసిస్తు్నారు. రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం సరైనదేనని అంతా నమ్ముతున్నారు. పైగా ఐటీ శాఖ గురించి ఇంత చర్చ జరిగింది కాబట్టి శ్రీధర్ బాబు దృష్టికి ఈ విషయం వెళ్లే ఉంటుంది కాబట్టి తప్పక ఆయన ప్రెస్టీజ్‌గా తీసుకుని అయినా ఐటీ శాఖకు న్యాయం చేస్తారని అంతా భావిస్తున్నారు. 

Will Sridhar Babu match KTR?:

New IT Minister Sridhar Babu in Telangana
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs