Advertisement
Google Ads BL

BB7 : శివాజీ చేసింది కరెక్ట్ అంటారా?


బిగ్ బాస్ సీజన్ 7 లో శివాజికి అమ్మాయిలంటే అస్సలు పడడం లేదు. శోభా శెట్టి, ప్రియాంక జైన్ ఇంతకుముందు మరికొంతమంది అమ్మాయిలని శివాజీ పదేపదే టార్గెట్ చేసారు. వారి టాస్క్ పెరఫార్మెన్స్ ఎలా ఉన్నా వారు గొడవ పడే విధానం ఆయనకి నచ్చేది కాదు, అబ్బాయిలతో పోటీ పడడం, అబ్బాయిల మీద అరవడం ఆయనకు నచ్చేది కాదు. దానితో అమర్ దీప్, శోభా శెట్టి, ప్రియంకలని ఆయన ఎలాగైనా ఇంట్లో నుంచి పంపించాలని చూసారు. కానీ వారు టాప్ 5 వరకు వచ్చేసారు. అయితే ఈ వారం శోభా శెట్టి, ప్రియంకాలపై శివాజీ చేసిన కామెంట్స్ కి నాగార్జునకి  బాగా కోపం తెప్పించాయి. దానితో వీకెండ్ ఎపిపోడ్ లో క్లాస్ పీకారు.

Advertisement
CJ Advs

శివాజీ ఇలాంటి అమ్మాయిలని చేసుకోబోయే వాళ్ళు ఎలా ఉంటారు, అసలు వీళ్ళని పెళ్లి చేసుకుంటే అనే మాటలు, అదే ఇలాంటి అమ్మాయిలు మా ఇంట్లో ఉంటే పీక మీద కాలేసి తొక్కుతా అనే మాటలను తప్పుబడుతూ వీడియోస్ వేసి నాగార్జున శివాజీకి చూపించారు. దానితో శివాజీ పొరబాటు అయ్యింది అంటూనే వాళ్ళు అలానే ఉన్నారు సర్, వాళ్ళు అరిచే అరుపుల్తో నా సహనం సచ్చిపోయింది. అందుకే ఇలా అన్నాను. ఒకరి కోసం ముగ్గురు వచ్చేస్తారు గొడవ పడతారు, అందుకే నాకు కోపం వచ్చింది అన్నాడు శివాజీ.

మరి పెళ్లి చేసుకోబోయే వాడి గురించి అలా ఎందుకు మాట్లాడావ్, ఆ మాటల వల్ల వాళ్ళ పెళ్లి ఆగిపోతే అన్నారు నాగ్. నేను అంటేనే ఆగుతుందా.. వాళ్ళు చూడడం లేదా అంటూ శివాజీ పదే పదే అతను చేసిన తప్పుని సమర్ధించుకున్నాడు. కానీ నాగ్ మాత్రం శివాజీని వదల్లేదు. నువ్వు అలా మాట్లాడకూడదు, నీ ఇంట్లో అమ్మాయిలని అలాగే చేస్తావా అంటూ గట్టిగా క్లాస్ పీకగా.. శివాజీ మాటలు బయట అమ్మాయిలకి కూడా కోపం తెప్పించాయి. 

BB7 : What Shivaji did was right?:

Bigg Boss 7: Yeaerday episode highlights 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs