Advertisement
Google Ads BL

BB7 : అమర్ దీప్ ని వైఫ్ వదిలేయాలా?


బిగ్ బాస్ సీజన్ 7 లో టైటిల్ ఫేవరెట్ గా దిగిన అమర్ దీప్ ఇప్పుడు బాగా డల్ అయ్యాడు. పల్లవి ప్రశాంత్ విషయంలో అమర్ దీప్ బిహేవియర్ పై బయట నెటిజెన్స్, అటు పల్లవి ఫాన్స్ అంతా అమర్ దీప్ ఫ్యామిలీని టార్గెట్ చేస్తున్నారు. అమర్ దీప్ పల్లవి ప్రశాంత్ చెయ్యి కొరకడం, పల్లవి ప్రశాంత్ చేసిన హంగామాతో అతనికి ఏమయ్యిందో అనే ఊహలో అమర్ దీప్ ని టార్గెట్ చెయ్యడమే కాకుండా పల్లవి అభిమానులు అమర్ వైఫ్ ని, ఆయన తల్లితండ్రులని టార్గెట్ చేస్తున్నారు. ఎంతలా అంటే అమర్ కోపానికి నువ్వు బలవ్వడం ఎందుకు తేజు అమర్ దీప్ కి విడాకులిచ్చేయ్, అతనితో విడిపో, ప్రశాంతంగా ఉండు అనే కామెంట్స్ పెట్టేదాకా వచ్చేసింది. 

Advertisement
CJ Advs

అమర్ తో ఎలా కలిసి ఉంటావు అంటూ తేజస్విని చూసి జాలి పడుతూ నెటిజెన్స్, పల్లవి అభిమానులు వరెస్ట్ కామెంట్స్ పెడుతున్నారు. దానితో తేజస్విని లైవ్ లోకొచ్చి నన్ను చూసి బాధపడకండి, అమర్ ని ఎంతగా రెచ్చగొడితే అమర్ అలా రియాక్ట్ అయ్యాడో నాకు తెలుసు, నేను అంతగా రెచ్చగొట్టే పరిస్థితికి రాను, మీరు నన్ను చూసి జాలి పడకండి కూల్ గా ఉండండి, అమర్ ఏమిటో నాకు తెలుసు అంటూ బదులిచ్చింది. అయితే లోపల వాళ్ళు గేమ్ లతో కొట్టుకుంటుంటే.. బయట వాళ్ళ ఫాన్స్ కామెంట్స్ కొట్టుకోవడం వరకు ఓకె.. కానీ కుటుంబాలని టార్గెట్ చేస్తున్నారు.

ఇంతకుముందే అమర్ వైఫ్ తేజు చెప్పింది.. ఇలాంటి ట్రోలింగ్ వల్ల తాను డిప్రెషన్ లోకి వెళ్ళాను అని. మరి బిగ్ బాస్ వల్ల ఆ కంటెస్టెంట్స్ కి ఎంత మంచి జరుగుతుందో తెలియదు కానీ.. ఇలాంటి నెగెటివ్ కామెంట్స్, ట్రోలింగ్ వల్ల మాత్రం సఫర్ అవ్వడం ఖాయం. 

BB7 : Should Amardeep leave his wife?:

Bigg Boss 7: Amardeep Wife Tejaswini emotional Video on Negative comments
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs