Advertisement
Google Ads BL

BB7: వీడియోస్ చూపించి వణికించిన నాగ్


బిగ్ బాస్ సీజన్ 7 చివరి వారంలోకి ప్రవేశించబోతుంది. ఇప్పటికైనా హౌస్ అంతా కూల్ గా కనిపిస్తుంది అనుకుంటే.. ఇప్పటికి బిగ్ బాస్ హౌస్ లో గొడవలు, కొట్టుకోవడము, తిట్టుకోవడాలు అన్నీ కనిపిస్తున్నాయి. అసలు హౌస్ లో చివరి వారాల్లో ఫన్ కనిపించాలి కానీ.. ఈ సీజన్ లో మాత్రం పగా, ద్వేషం కనిపిస్తుంది. ముఖ్యంగా శివాజీ అమ్మాయిలైన శోభా శెట్టి, ప్రియాంక లు ఇప్పటివరకు హౌస్లో ఉండడాన్ని సహించలేకపోతున్నాడు. మరోపక్క శోభా శెట్టి యావర్ ని అందరిని రెచ్చగొడుతుంది. అమర్ ఆడలేక ప్రశాంత్ పైకి వెళ్లడం, వారిద్దరి గొడవ ఇవన్నీ ఈ వారం కూడా సేమ్ అలానే ఉంది.

Advertisement
CJ Advs

ఎప్పటిలాగే నాగార్జున ఈవారం హౌస్ లోని కొంతమందిపై వారు చేసిన తప్పులని వీడియోస్ వేసి మరీ చెడుగుడు ఆడుకున్నారు. ముందుగా శోభా శెట్టిని కన్ఫెషన్ రూమ్ లోకి పిలిచి ఆమె బిహేవియర్ ని వీడియోస్ వేసి చూపించారు. ప్రియాంకకి సంచాలక్ గా ఎందుకు ఫేవరిజం చూపించావ్ అన్నారు. అలాగే ఆటలో నువ్వు అందరిని డిస్టర్బ్ చేస్తున్నావ్, యావర్ విషయంలో శోభా శెట్టి చెప్పిన అబద్దం నిజమని వీడియో వేసి చూపించగానే శోభ శెట్టి బిక్కమొహం వేసింది. చివరికి ఆమె ఏడ్చేసింది. ఆ తర్వాత యావర్ ని పిలిచి నువ్వు ఛీ, తూ, పో ఏంటి ఆ బిహేవియర్, అమ్మాయిలని ఆలా అనొచ్చా అన్నారు. దానికి యావర్ అలా కాదండి నన్ను రెచ్చగొటింది అందుకే అనగానే యావర్ ఛీ అన్న వీడియో వేసి చూపించి క్లాస్ పీకారు.

ఇక శివాజీని కన్ఫెషన్ రూమ్ లోకి పిలిచి అమ్మాయిలపై కోపమొస్తే వాళ్ళ గొంతుమీద కాలేసి ఏం మాట అది అనగానే.. అవునండి అన్నాను ఫ్లోలో అన్నాడు శివాజీ. అదే మీ ఇంట్లో అమ్మాయిలని అలా అంటావా అంటే అవునండి తప్పు చేస్తే అంటాను, అలాగని కాలేసి తొక్కుతామా.. ఆ అమ్మాయిలు అలానే చేస్తారు వీడియోస్ చూడండి సర్ అన్నాడు. దానితో నాగ్ కి చాలా కోపమొచ్చింది. అంతేకాకుండా శివాజీ అబ్బాయిలని అమ్మాయిలు అనొచ్చా అనగానే ఇక్కడ టాపిక్ మార్చకు అంటూ శివాజీపై నాగ్ ఫైర్ అయ్యారు. ఇక పల్లవి ప్రశాంత్ ని పిలిచి అమర్ కొరికాడని చాలా సీన్ చేసావ్, అంత లేదు, నాకు డాక్టర్ చెప్పాడు అని పల్లవి నిజ స్వరూపాన్ని చూపించారు. అంతేకాదు నువ్వు శివాజీకి సేవకుడివా, శివాజీకి గులాం కొట్టడానికి హౌస్ లోకి వచ్చావా అంటూ ప్రశాంత్ ని కడిగిపారేశారు.

ఇక అమర్ దీప్ ని పిలిచి నీ బిహేవియర్ చూస్తే పిచ్చోడు అంటారు. నువ్వు ప్రశాంత్ ని కొరకడమేమిటి దానిని ఏమంటారో తెలుసా అని ప్రియాంక ని కూడా పిలిచి, అమర్ ని ఎందుకిలా చేస్తున్నాడు అనగానే అవును సర్ చెప్పినా వినలేదు అంది. దానితో అమర్ కి కూడా నాగార్జున గట్టిగా క్లాస్ పీకారు. 

BB7: Nagarjuna fire on housemates:

Big Boss 7: Nagarjuna fire on Amar and Sivaji and Sobha and Yawar
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs