తెలంగాణ వచ్చాక తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చింది నేనే అంటూ ప్రజల నుంచి నీరాజనాలు అందుకుని అదే ఊపులో TRS పార్టీ పెట్టి ప్రజల మద్దతుతో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి గత పదేళ్లుగా తెలంగాణ ముఖ్యమంత్రిగా రాజసాన్ని ఒలకబోసిన కేసీఆర్ ని అదే తెలంగాణ ప్రజలు గద్దె దించి ప్రతిపక్షంలో కూర్చోబెట్టి ఫామ్ హౌస్ కి పంపించారు. ఎర్రవల్లిలో ఫామ్ హౌస్ ని నిర్మించుకుని ప్రజల మీద దృష్టి కన్నా ఎక్కువగా ఫామ్ హౌస్ మీదే పెట్టి రెస్ట్ తీసుకున్న కేసీఆర్ ని నిజంగానే రెస్ట్ తీసుకోమన్నారు తెలంగాణ ప్రజలు.
ఇక తెలంగాణాలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన విషయం తెలిసి సైలెంట్ గా ముఖ్యమంతి పదవికి రాజీనామా చేసి ఎర్రవల్లి ఫామ్ హౌస్ కి వెళ్లిపోయిన కేసీఆర్ గురువారం రాత్రి బాత్ రూమ్ లో కాలు జారిపడిపోయారు. దానితో ఆయన తుంటి ఎముక విరిగినట్లు చెప్పారు. అక్కడనుంచి ఆయన్ని వెంటనే యశోద ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షలు నిర్వహించారు. తుంటి ఎముక విరిగినట్లు వైద్యులు నిర్ధారించారు. అయితే నిన్న కేసీఆర్ కి సర్జరీ చేస్తున్నట్లుగా వార్తలొచ్చాయి. ఆ సర్జరీ సక్సెస్ ఫుల్ గా పూర్తయ్యిందిఅని చెప్పారు. అయితే నిన్న సర్జరీ జరిగిన కాలితో ఈరోజు వైద్యులు కేసీఆర్ ని నడిపించిన వీడియో రివీల్ చేసారు.
నిన్న జరిగిన తుంటి ఎముక మార్పిడి శస్త్ర చికిత్స విజయవంతం అవడంతో.. వైద్యుల పర్యవేక్షణలో నడుస్తున్న బీఆర్ఎస్ అధినేత శ్రీ కేసీఆర్.. అంటూ BRS సోషల్ మీడియా హ్యాండిల్ నుంచి అప్ డేట్ ఇచ్చారు. అది చూసిన జనాలు వైద్యశాస్త్రం లో ఇదో మెడికల్ మెరాకిల్, నిన్న సర్జరీ, ఇవ్వాళ నడక🙄, అప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రజలని నడిపించారు, ఇప్పుడు మాజీగా నడక నేర్చుకుంటున్నారు అంటూ కొంతమంది ఆశ్చర్యపోతూ కామెడీగా మాట్లాడుతున్నారు.