Advertisement
Google Ads BL

ప్రభాస్ లుక్ చూసి సర్ ప్రైజ్ అవుతున్న ఫాన్స్


కొన్నాళ్లుగా అంటే బాహుబలి తర్వాత ప్రభాస్ లుక్స్ విషయంలో ప్రతిసారి, ప్రతి సినిమా కి ప్రభాస్ ఫాన్స్ ఆయన్ని చూసి డిస్పాయింట్ అవుతూనే ఉన్నారు. బాహుబలి బరువుని ప్రభాస్ ఎంత వదిలించుకుందామన్నా వదలడమే లేదు. అటు హెయిర్ స్టయిల్, ఇటు గొంతు విషయంలో, అలాగే హ్యాండ్ సమ్ లుక్స్ అన్నీ మిస్ అవుతున్నాయి. ఇంకా సినిమాలు ప్లాప్ అవుతున్నాయి. ప్రభాస్ లుక్స్ విషయంలో విమర్శలు రావడంతో అభిమానులు పదే పదే డిస్పాయింట్ మోడ్ లోకి వెళుతున్నారు.

Advertisement
CJ Advs

సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ ఇలా ప్రతి సినిమాలో ప్రభాస్ లుక్స్ పై విమర్శలు వచ్చాయి. ఇక బయట ఎక్కడ కనిపించినా ప్రభాస్ తలకి ఓ క్లాత్ ఉండడం అభిమానులకి అసలు నచ్చడం లేదు. ఇక రాబోయే సలార్ లో ప్రభాస్ ఎలా ఉండబోతున్నాడో ట్రైలర్ లో చూసేసాం.  తాజాగా ప్రభాస్ లుక్ చూసి అభిమానులు ఒక్కసారిగా సర్ ప్రైజ్ అయ్యారు. హెయిర్ స్టయిల్, మీసకట్టు, అన్ని ప్రభాస్ ని చాలా రోజుల తర్వాత హ్యాండ్ సమ్ గా చూపించాయి.

ఈరోజు నెట్ ఫ్లిక్స్ సీఈవో ప్రభాస్ ని కల్కి టీమ్ నాగ్ అశ్విన్, స్వప్న దత్ ని కల్కి సెట్స్ లో కలిసి మీటింగ్ పెట్టిన పిక్ వైరలయ్యింది. ఆ పిక్ లో ప్రభాస్ ని చూసి ఫాన్స్ మురిసిపోతున్నారు అభిమానులు. ఎన్నాళ్లకెన్నాళ్లకు ప్రభాస్ లుక్ లో చేంజ్ అంటూ వారు సంబరాలు చేసుకుంటున్నారు.

Handsome Look Of Prabhas Makes His Fans Go Crazy!:

Netflix CEO Meets Prabhas
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs