పుష్ప తో రికార్డ్ లు బ్రేక్ చేసిన అల్లు అర్జున్ మరో సినిమాకి రివ్యూ ఇవ్వడమనేది మాములు విషయం కాదు. అల్లు అర్జున్ మాత్రమే కాదు.. ఈ మధ్య చాలా మంది సెలెబ్రిటీలు ఆ సినిమా గురించి రివ్యూలు ఇస్తూ ఉండడం మనకి తెలిసిందే. ఇంతకీ ఏ సినిమా గురించి అనుకుంటున్నారా! ఎదో కాదు యానిమల్. తాజాగా అల్లు అర్జున్ సోషల్ మీడియా వేదికగా యానిమల్ సినిమాకు రివ్యూ ఇచ్చారు. ఈ రివ్యూ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. యానిమల్ సినిమా అల్లు అర్జున్ కి తెగ నచ్చేసిందట. ఆ రివ్యూలో సినిమా గురించి ఏం చెప్పాడంటే..
యానిమల్ సినిమా చూస్తుంటే మైండ్ బ్లోయింగ్ గా అనిపించింది. రణబీర్ కపూర్ మీ నటన గురించి చెప్పడానికి మాటలు రావడం లేదు. మీరు నటనతో మ్యాజిక్ చేశారు. సినీ ఇండస్ట్రీని ఎక్కడికో తీసుకెళ్లారు. రష్మిక.. ఇప్పటివరకు మీరు నటించిన సినిమాలన్నీ ఒకటి.. ఈ సినిమా ఒకటి. మీ నటనతో ఒక అద్భుతాన్ని సృష్టించారు. ఇలాంటి సినిమాలెన్నింటిలోనే నటించాలని కోరుకుంటున్నాను. నటుడు బాబీ డియోల్ నటనతో ప్రేక్షకులలో మాటలు రాకుండా చేశారు. అనిల్ కపూర్ ఎంతో ఎమోషనల్ ని ప్రదర్శించారు. నటనలో మీ అనుభవమంతా ఈ పాత్రలో వ్యక్తమవుతోంది. త్రిప్తి డిమ్రి.. కొత్త నటి అయినప్పటికీ ఎందరో ప్రేమని పొందారు. ఇంకా ముందు ముందు ఇంకెందరో ప్రేమని పొందాలని కోరుకుంటున్నాను.
చివరిగా దర్శకుడు సందీప్ వంగా.. యానిమల్ సినిమాతో మేమంతా తలెత్తుకునేలా చేశారు. సినిమాటిక్ లో మరో కొత్త కోణాన్ని పరిచయం చేశారు. ముందు ముందు మీరు తీసే సినిమాలు సినీ ఇండస్ట్రీని ఎంతగా మార్చుతాయో నేను ఉహిస్తున్నాను. అంటూ అల్లు అర్జున్ సోషల్ మీడియాలో ఇచ్చిన రివ్యూలో పేర్కొన్నారు.