సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్, రష్మిక హీరో హీరోయిన్ లుగా నటించిన చిత్రం బాక్సాఫీస్ వద్ద దూసుకెళుతోంది. మొదటి వారం కలెక్షన్స్ విషయంలో దాదాపు ఈ సినిమా సునామీని సృష్టించింది. టాలీవుడ్ దర్శకుడు మరోసారి బాలీవుడ్ లో మ్యాజిక్ చేశాడు. ఫస్ట్ వారం ఈ సినిమా రికార్డ్ కలెక్షన్లు సృష్టించి వెయ్యి కోట్ల దిశగా పరుగులు తీస్తోంది.
మొదటి వారం ఈ సినిమా 563.3 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టినట్లుగా మేకర్స్ అధికారికంగా పోస్టర్ విడుదల చేశారు. ఇంకా కలెక్షన్లు స్టడీగానే ఉన్నాయి. ఈ వారం రెండు మూడు సినిమాలు విడుదలైనప్పటికీ యానిమల్ సినిమా మాత్రం బాక్సాఫీస్ వద్ద విజయ దుందుభి మోగిస్తూనే ఉంది. మరో విశేషం ఏమిటంటే బాలీవుడ్ లో యానిమల్ 24 గంటలు ప్రదర్శియించబడడం విశేషం.
ఈ మధ్య కాలంలో ఇప్పటి వరకు ఏ సినిమాకి ఇలా జరగలేదు. ఈ విషయంలో రికార్డ్ ల దిశగా దూసుకెళుతోంది. రోజు రోజుకి ఈ సినిమా కలెక్షన్లు పెరగడమే తప్ప తగ్గడం లేదు.ఈ సినిమాలో ఉన్న కంటెంట్ కి యూత్ అంతలా కనెక్ట్ అవుతోంది. యానిమల్ సాధించిన కలెక్షన్లు చూస్తుంటే ముందు ముందు మరిన్ని రికార్డ్ లు బ్రేక్ చేయడం ఖాయమనేలా ట్రేడ్ నిపుణులు మాట్లాడుకుంటున్నారు. ఈ సినిమాకి సంబంధించి ప్రతి ఒక్కరు వాళ్ళ రివ్యూ ఇస్తూ ఉండడం మరో విశేషం.