Advertisement
Google Ads BL

రేవంత్ వేట ప్రారంభమైంది.. ఇక తగ్గేదేలే..!


తెలంగాణలో అధికారం మారింది.. అలాగే ముఖ్యమంత్రి కూడా మారారు. మాంచి దూకుడుగా వ్యవహరించే రేవంత్ రెడ్డి సీఎంగా తన గేమ్ మొదలు పెట్టారు. కలుగులో దాక్కొన్న ఎలుకలన్నింటినీ బయటకు తీసుకొచ్చే ప్రయత్నం స్టార్ట్ చేశారు. ఇక అంతే కొందరు అధికారులు, రాజకీయ నాయకుల గుండెల్లో రైళ్లు జెట్ స్పీడులో పరిగెడుతున్నాయి. కొందరు అధికారులు రిజైన్ చేసి చేతులు దులుపుకుందామనుకున్నారు. ఊరుకుంటారా? అన్నీ లెక్కలు చెప్పాకే రాజీనామాలకు ఆమోదమని రేవంత్ తేల్చి చెప్పారు. ఒక్కొక్కరికీ సినిమా అయితే స్టార్ట్ అయిపోయింది. మరోవైపు కాళేశ్వరం అవినీతిపై విచారణ జరపాలంటూ ప్రముఖ న్యాయవాది రాపోలు భాస్కర్ రావు తెలంగాణ ఏసీబీకి పిటిషన్ ఇచ్చారు. కాళేశ్వరంలో మొట్టమొదటిదైన మేడిగడ్డ బ్యారేజ్‌ కుంగిపోయిన విషయం తెలిసిందే. 

Advertisement
CJ Advs

 

ఎందరి పునాదులు కదులుతాయో..

 

అప్పట్లో దీనిని రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ స్వయంగా పరిశీలించి పనులు నాసిరకంగా చేశారని.. పునాదులు ఇసుకతో నిర్మించారని ఆరోపించారు. ఇప్పుడు ఏసీబీకి ఫిర్యాదు అందింది. మాజీ సీఎం కేసీఆర్, హరీష్ రావు, కవిత, ప్రధాన కాంట్రాక్టర్ మేఘారెడ్డి,  ప్రాజెక్ట్ ఇంజనీర్ ఇన్‌ చీఫ్ వెంకటేశ్వర్లు తదితరుల అవినీతి బాగోతమే మేడిగడ్డ అని పేర్కొన్నారు. ఇక ఇది విచారణ ప్రారంభించారో వరుసబెట్టి ఎందరి పునాదులు కదులుతాయోననే ఆసక్తికర చర్చ అయితే జరుగుతోంది. నిజానికి కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిందనగానే విమర్శలు అన్నీ ఇన్నీ రాలేదు. బీఆర్ఎస్‌తో కంపేర్ చేస్తూ సోషల్ మీడియాలో నానా రకాల కథనాలు.. వీటన్నింటినీ పరిగణలోకి తీసుకుని రేవంత్ తనదైన స్టైల్లో దూసుకెళుతున్నారు. ఇక తెలంగాణలో బీభత్సమైన అవినీతి పేరుకుపోయిన విద్యుత్ రంగాన్ని ప్రక్షాళన చేపట్టే కార్యక్రమాన్ని సైతం రేవంత్ చేపట్టారు. మొత్తానికి వేట అయితే ప్రారంభించారు. తగ్గేదేలేదన్నట్టుగా దూసుకెళుతున్నారు.

 

మైకులో హెచ్చరికలు..

 

ముందుగా నిజామాబాద్‌ జిల్లాలోని ఆర్మూరు మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి రూ. 2.5 కోట్ల విద్యుత్ బకాయిలు, టీఎస్‌ఆర్టీసీకి రూ.7.23 కోట్లు లీజు బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి. ఆర్మూరు పట్టణంలో టీఎస్‌ఆర్టీసీకి చెందిన 7,000 గజాల స్థలంలో ఆయన కట్టుకొన్న జీ-1 మల్టీప్లెక్స్‌ షాపింగ్ మాల్‌కు విద్యుత్ బిల్లులు చెల్లించకుండా అప్పనంగా వాడుకుంటున్నారు. అటు విద్యుత్.. ఇటు టీఎస్‌ఆర్టీసీ అధికారులు ఆయను చుట్టూ తిరిగినా ఫలితం లేకపోయింది. దీంతో రేవంత్ అధికారం చేపట్టగానే.. ఆ షాపింగ్ మాల్‌కు విద్యుత్ సరఫరా నిలిపివేశారు. అలాగే షాపింగ్ మాల్‌ని జప్తు చేస్తామంటూ మైకులో హెచ్చరికలు జారీ చేశారు. అలాగే విద్యుత్ శాఖకు అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం 85-90 వేల కోట్లు అప్పులు చెల్లించాల్సి ఉందట. దీంతో విద్యుత్ శాఖ ముఖ్య కార్యదర్శిని సమీక్షా సమావేశానికి హాజరుకావాలని ఆదేశించారు. దెబ్బకు కేసీఆర్ ఆప్తుడు, ట్రాన్స్ కో, జెన్ కో సీఎండీ ప్రభాకరరావు సహా కొందరు చైర్మన్లు, మేనేజింగ్ డైరెక్టర్లు రాజీనామాలు చేశారు. కానీ రేవంత్ ఎవ్వరి రాజీనామాలు ఆమోదించవద్దని.. లెక్కలు అప్పజెప్ప మరీ వెళ్లాలని ఆదేశించారు. అంతే.. ఏం చేయాలో పాలుపోని స్థితిలో సదరు అధికారులంతా ఉన్నారు.

Revanth Reddy game starts as a CM:

Revanth Reddy is The Telangana Next CM
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs