Advertisement

సీఎంలిద్దరూ రెడ్లే.. ఇద్దరి మధ్య ఎంత తేడా!


యాధృచ్చికంగా జరిగాయి కానీ ఏపీ సీఎం జగన్, తెలంగాణ సీఎం రేవంత్ మధ్య కొన్ని విషయాల్లో సారూప్యం అయితే ఉంది. నిజానికి ఒక ఎమ్మెల్యేగా ఎన్నికయ్యేందుకు ముందుగానే బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఓపెన్ కేటగిరీ అంటూ కేటగిరీలు డిసైడ్ అవుతాయి. ఆ కేటగిరి ప్రకారమే పార్టీలన్నీ అభ్యర్థులను ఎంపిక చేస్తాయి. కానీ సీఎంకు కేటగిరీలతో పని లేదు. ఎవరినైనా విజయం సాధించిన పార్టీ నియమించవచ్చు. అలాగే తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి ఎన్నికయ్యారు. ఇక జగన్‌తో సారూప్యమేంటంటే.. ఆయన కూడా రెడ్డే కావడం. అనుకోకుండా తెలుగు రాష్ట్రాల సీఎంలు ఇద్దరూ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారే కావడం గమనార్హం. 

Advertisement

కూల్చివేతలతోనే పాలన ప్రారంభం..

ఇక మరో సారూప్యం కూడా ఉంది. అటు జగన్.. ఇటు రేవంత్ ఇద్దరూ కూల్చివేతలతోనే తమ అధికారాన్ని ప్రారంభించారు. 2019లో ఏపీలో జరిగిన ఎన్నికలలో వైసీపీ ఘన విజయం సాధించింది. జగన్మోహన్ రెడ్డి సీఎంగా అధికార బాధ్యతలు చేపట్టారు. ఆ వెంటనే తీసుకున్న తొలి నిర్ణయం ప్రజలను ఆశ్చర్యానికి గురి చేసింది. టీడీపీ ప్రభుత్వం హయాంలోప్రజల సమస్యలు విని వాటికి పరిష్కారాలను సూచించాడనికి తన నివాసానికి దగ్గరలో ఉండవల్లి ప్రాంతంలో చంద్రబాబు ప్రజావేదికను నిర్మించారు. దానిని కూల్చివేయాలని జగన్ నిర్ణయం తీసుకోవడం విస్మయానికి గురి చేసింది. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉన్న ప్రజావేదికను కూల్చివేయడమేంటని ఏపీలో నిరసనలు వెల్లువెత్తాయి. కానీ జగన్ ఏమాత్రం తగ్గలేదు. అనుకున్నది అనుకున్నట్టు చేసేశారు.

ఇద్దరు సీఎంల ఆలోచనల్లో ఎంతో వ్యత్యాసం..

ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అధికారంలోకి రాగానే.. ప్రగతి భవన్ గోడలను బద్దలు చేశారు. కానీ జగన్‌కు రేవంత్‌కు చాలా తేడా ఉంది. అక్కడ ప్రజా సమస్యలను వినేందుకు కట్టిన నిర్మాణాన్ని జగన్ కూల్చివేసి జనాల దృష్టిలో విలన్ అయితే.. ఇక్కడ జనాలకు ప్రవేశం లేకుండా నిర్మించిన బారికేడ్లు, ఇనుప గేట్లను కూల్చివేసి రేవంత్ హీరో అయ్యారు. ప్రతి శుక్రవారం ప్రజా దర్బార్‌ను నిర్వహించి ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కరిస్తామని చెప్పడం ఆసక్తికరంగా మారింది. రేవంత్ చెప్పినట్టుగానే దొరల పాలన ముగిసి ప్రజాపాలన ప్రారంభమవబోతోందని ప్రగతి భవన్ విషయంలో జనం నమ్ముతున్నారు. ప్రజాదర్బార్ నేడు ప్రారంభం కానుంది. మొత్తానికి ఏపీ, తెలంగాణల్లో కూల్చివేతలతోనే ప్రారంభమైనప్పటికీ ఇద్దరు సీఎంల ఆలోచనల్లో వ్యత్యాసం ఎంతో ఉంది. ఒకరు ప్రజలను చేరుకోవడానికి.. మరొకరు ప్రజలను ప్రభుత్వం నుంచి దూరంగా ఉంచేందుకు కూల్చివేతలు చేశారు.

Difference between cm Jagan and cm Revanth :

Difference between Telugu States chief ministers
Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement