మాస్ మహారాజాకి కష్టకాలం మొదలైందా? అంటే అవుననే చెప్పాలి. ఒకప్పుడు వరుస ప్లాప్స్ తో కెరీర్ అయిపోయిందని అనుకుంటున్నతిరిగి మళ్ళీ పుంజుకున్న రవితేజ, రెండు మూడు వరుస హిట్స్ తో లైన్ లోకి వచ్చాడనేల పేరు తెచ్చుకున్నాడు. ఫాన్స్ కూడా ఊపిరి పీల్చుకున్నారు. కానీ పరిస్థితి మళ్ళీ మొదటికి వచ్చింది.
ఈ మధ్య రవితేజకు వరుస ప్లాప్స్ ఎదురవుతున్నాయి. ఎన్నో ఆశలతో చేసిన పాన్ ఇండియా సినిమా టైగర్ నాగేశ్వర రావు కూడా దారుణంగా పరాజయం పాలైయింది. ఆ సినిమా సెట్స్ పై ఉన్నప్పుడు అంగీకరించిన సినిమాలన్నీ, ఆ సినిమా రిజల్ట్ తరువాత అనుమానంలో పడ్డాయి. అనుమానం అనేకాదు ఆగిపోయినట్లుగా వార్తలు వినవస్తున్నాయి.
బలుపు, క్రాక్ చిత్రాలతో రవితేజకు లైఫ్ ఇచ్చిన గోపిచంద్ మలినేనితో ఓ సినిమా చేయాల్సి ఉండగా.. అది ఆగిపోయిందని అంటున్నారు. రాజా ది గ్రేట్ తో రవితేజ ఫామ్ ని తెలియ చేసిన అనిల్ రావిపూడి తో అనుకున్న మరో సినిమా కూడా బడ్జెట్ కారణంగా నిలిపి వేసినట్లుగా టాక్ నడుస్తుంది. దీనికి రవితేజ స్వయంకృతాపరాధం కూడా కారణంగా తెలుస్తుంది. వరుస ప్లాప్స్ వస్తున్నా.. రెమ్యూనరేషన్ విషయంలో రవితేజ తగ్గకపోవడం కూడా ఈ ప్రాజెక్ట్స్ ఆగిపోవడానికి కారణంగా తెలుస్తుంది. చూద్దాం రవితేజ భవిషత్తు ఎలా ఉండనుండో?